పాక్‌ పర్యటనకు బంగ్లా ఓకె వచ్చే ఏడాది పర్యటనకు గ్రీన్‌ సిగ్నల్‌

ఢాకా, డిసెంబర్‌ 18: ఎట్టకేలకు పాకిస్థాన్‌ గడ్డపై అంతర్జాతీయ క్రికెట్‌ రీ ఎంట్రీకి రంగం సిధ్దమ వుతోంది. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు పాక్‌లో పర్యటిం కళిందుకు అంగీకరించింది. వచ్చే ఏడాది ప్రారం భంలో ఈ టూర్‌ ఉండొచ్చని సమాచారం. అదే జరిగితే 2009లో శ్రీలంకపై ఉగ్రవాదుల దాడి జరిపిన తర్వాత అక్కడ పర్యటించే తొలి విదేశీ జట్టు బంగ్లానే అవుతుంది. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు మాజీ ప్రెసిడెంట్‌ ముస్థాఫా కమల్‌ ఇచ్చిన మాట ప్రకారం పాక్‌లో తమ జట్టు ఆడుతుందని బీసిబి ఇవాళ ప్రకటించింది. ముస్థాఫా మాటకు తాము కట్టుబడి ఉన్నామని, అయితే సెక్యూరిటీ క్లియ రెన్స్‌పై ఇది ఆధారపడి ఉందని బిసిబి క్రికెట్‌ ఆప రేషన్స్‌ హెడ్‌ హుసైన్‌ సిరాజ్‌ చెప్పారు. బీసిబీ ప్రకటనతో పాక్‌ క్రికెట్‌ బోర్డ్‌ సంతోషంగా ఉంది. దాదాపు మూడేళ్ళ తర్వాత పాక్‌ గడ్డపై అంతర్జా తీయ సిరీస్‌ జరగనుండడం తమకు మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయని పిసిబీ తెలిపింది. 2009లో శ్రీలంక జట్టు పర్యటన సందర్భంగా లా¬ర్‌లో క్రికెటర్లు ప్రయాణిస్తోన్న బస్‌పై ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఆటగాళ్ళందరికీ గాయల వగా… పాక్‌లో పర్యటించేందుకు అప్పటి నుండీ ఏ జట్టు కూడా అంగీకరించడం లేదు. దీంతో అబు దాబీని తటస్థ వేదికగా చేసుకుని పాక్‌ సిరీస్‌లు ఆడింది. అయితే పాక్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ జాకా అష్రాఫ్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితిని మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దీనిలో భాగంగా ఈ ఏడాది బంగ్లాదేశ్‌తో చర్చలు జరఞ ఎగా.. ముందు అంగీకరించిన ఆ దేశ క్రికెట్‌ బోర్డు తర్వాత తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే పిసీబీ తమ ప్లేయర్లను బంగ్లాదేశ్‌ ప్రీమి యర్‌ లీగ్‌లో ఆడేంచే నిబంధనతో ప్రస్తుత టూర్‌ కు ఒప్పంచిందని సమాచారం. అయితే ఈ పర్య టన వన్డే, టీ ట్వంటీలకే పరిమితమయ్యే అవకా శాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తమ దేశంలో భద్రతపై ఆందోళన లేదని నిరూపించుకునేందుకు ఇటీవలే మాజీ క్రికెటర్లతో రెండు టీ ట్వంటీ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు నిర్వహించారు.