పాఠశాలల్లో సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం
కాంగ్రెస్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు సరిరామ్ నాయక్
టేకులపల్లి, సెప్టెంబర్ 16( జనం సాక్షి ): ప్రభుత్వ పాఠశాలల్లో మండలంలో ఏ పాఠశాల చూసిన కనీస వసతులకు కరువై విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంటే అందుకు టిఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు బానోత్ సరిరామ్ నాయక్ అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలకలలాడుతూ ఉండేవని, నేటి పరిస్థితి చూస్తే పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక పోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. పాఠశాలలో మెనూ ప్రకారం సక్రమమైన భోజనాలు పెట్టకపోవడం టాయిలెట్స్ లేకపోవడం వంటశాలలు లేకపోవడం లాంటి ఎన్నో సమస్యలు ఉంటున్నప్పటికీ విద్యార్థులు ఉపాధ్యాయులు ఇబ్బందులు గురవుతూ పలుమార్లు ప్రభుత్వం దృష్టికి సమస్యల గురించి తీసుకువెళ్తున్న పట్టించుకోకపోవడం ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు . ప్రభుత్వ పాఠశాలలు పేద విద్యార్థులే ఎక్కువగా చదువుకుంటారని వారి కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం అంకెల్లో ప్రకటనలు చేయటమే తప్ప పట్టించుకున్న పాపాన పోవట్లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించినట్లయితే ఆందోళనలు చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.