పాణ్యం ఎమ్మేల్యే రాంభూపాల్‌రెడ్డిపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు
హైదరాబాద్, జనంసాక్షి: కర్నూలు జిల్లా పాణ్యం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంభూపాల్‌రెడ్డిపై మహిళా సంఘం నేత మానవ హక్కుల కమిషనర్ (హెచ్‌ఆర్సీ) కు ఫిర్యాదు చేశారు. లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ మహిళా సంఘం నేత ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్యాచారం చేయడానికి కూడా ప్రయత్నించారని ఆరోపించారు. పేదల పక్షాన ఉన్నందుకే వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.