పాతకక్షలతో ఇద్దరి హత్య
మహబూబ్‌నగర్ : ధరూర్ మండలం మన్నాపురం గుట్ట సమీపంలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. పాతకక్షల నేపథ్యంలో వీరిని ప్రత్యర్ధులు హత్య చేశారని స్థానికులు చెబుతున్నారు. మృతులను జీరబండ గ్రామానికి చెందిన నర్సింహులు (60), చింతరేవుల గ్రామానికి చెందిక బోయ లక్ష్మయ్య (45)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.