పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
గరిడేపల్లి,సెప్టెంబర్ 1 (జనం సాక్షి): సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపు మేరకు నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ గరిడేపల్లి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గరిడేపల్లి మండలంలోని ఉపాధ్యాయులు నల్ల బ్యడ్జీలు ధరించి విధులకు హాజరు కావడంతో పాటు ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా యూఎస్ పిసి నాయకులు మాట్లాడుతూ నూతన పెన్షన్ పథకం రద్దు కోసం మనం చేస్తున్న పోరాటాల ఫలితంగా డెత్ గ్రాడ్యుటీ ఫ్యామిలీ పెన్షన్ పొందగలగడం మనం గర్వించదగ్గ విషయం అన్నారు. ఇదే స్ఫూర్తిని నూతన పెన్షన్ పథకం రద్దు అయ్యేవరకు కొనసాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూఎస్ పిసి నాయకులు సత్యనారాయణ, శ్రీను, రణబోతు రవీందర్ ,అంజయ్య, సైదిరెడ్డీ ,రాంబాబు,కోటేశ్వర రావు,రామకృష్ణ, వెంకటేశ్వర రెడ్డి,స్వాతి,నర్సిరెడ్డి, వెంకటేశ్వర్లు,రాజ్యలక్ష్మి, వీరస్వామి,రేణుక,రఫీ, వీరనారాయణ, విజయలక్ష్మి, చంద్రకళ,నాగలక్ష్మి, శ్రీలత,జ్యోతి, ప్రభాకర్ రెడ్డి,అరుణ్,షరీఫ్, కృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణ,కృష్ణయ్య,నాగలక్