పారదర్శకత తో కూడిన వైద్య సేవలు అందించాలి
: ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
ఎల్బీ నగర్( జనం సాక్షి ) పారదర్శకత తో కూడిన వైద్య సేవలు అందించాలని ఎల్బీ నగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు అన్నారు . బుధవారం నాడు వనస్థలిపురం లో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మి హెల్త్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన బ్లాక్ ను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై హాస్పిటల్ యాజమాన్యం డా. ఎస్.లక్ష్మీ , డా.శ్వేత, డా.వంశీ, డా.శ్రీకాంత్, డా.సృజన, ఎస్. సుమన్ లు , , స్థానికులు లతో కలిసి జ్యోతి ప్రజల్వన చేసి రిబ్బన్ కట్చేసి ప్రారంభించారు .ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి . మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్స్ వ్యాపారధోరణితో కాకుండా సేవ దృక్పథం తో పని చేయాలని సూచించారు .వనస్థలిపురం ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో హాస్పిటల్ ను తీర్చి దిద్దడమే అభినందనీయమని అన్నారు .పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్య ఉండాలని సూచించారు.హాస్పిటల్ నిర్వాహకులు డా . లక్ష్మీ మాట్లాడుతూ అత్యాధునిక సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో హాస్పిటల్లో తీర్చిదిద్దడం జరిగిందని అన్నారు .మా ఆస్పత్రిలో అనుభవజ్ఞులైన వైద్యులు అన్ని రకాల వైద్య సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు . కార్డియాలజీ ,జనరల్ మెడిసిన్, సర్జరీ ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, పిడియాట్రిక్ ,ఏంటి కిడ్నీ వెన్నెముక తదితర విభాగాలకు చెందినటువంటి నిపుణులైన వైద్యుల సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు .అతి తక్కువ ఖర్చుతో ఆధునిక రోగ నిర్ధారణ వైద్య పరికరాలు పరీక్షించి రోగులకు పారదర్శకత కున్న వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో హాస్పిటల్ బ్లాక్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. .
