పారిశ్రామిక అభివృద్ది తోనే రాష్ట పురోగతి

` తెలంగాణలో 109 ఇండస్ట్రియల్‌ పార్కుల ఏర్పాటు
` లక్షల మందికి ఉపాధి…కోట్లల్లో పారిశ్రామిక పెట్టుబడులు…
హైద్రాబాద్‌(జనంసాక్షి): పారిశ్రామిక అభివృద్దితో రాష్ట్రం ఆర్ధికంగా పరిపుష్ఠి చెందుతోందనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద పీట వేసింది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015వ సంవత్సరంలో కొత్త పాలసీని రూపొందించి ప్రణాళికా బద్దంగా  రాష్ట్రం  ముందుకు సాగుతోంది.  కొత్త పాలసి రూపకల్పన ద్వారా తెలంగాణలో పరిశ్రమలు స్థాపించడం సులభ తరమైంది.  పరిశ్రమల స్థాపనకు అవసరమైన స్థలాలు మూంజూరు నుండి మౌళిక వసతుల కల్పన, అనుమతుల మంజూరి అన్ని ఆన్‌ లైన్‌ చేసింది. నూతన పారిశ్రామిక విధానం పారదర్శకంగా ఉండటంతో  ఎన్నో బహళ జాతీయ సంస్ధలు తెలంగాణలో తమ పెట్టుబడులు పెట్టాయి. ఇంకా చాలా సంస్థలు తెలంగాణ కేంద్రంగా తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించేందుకు ఉత్సాహం చూపుతున్నాయి.  సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే తెలంగాణ యువకులకు ఎన్నో ప్రోత్సహకాలను అందించే విధంగా పాలసిని రూపొందించింది.  నూతన పారిశ్రామిక విధానం ద్వారా ఎంతో మంది తెలంగాణ యువకులు పారిశ్రామిక వెత్తలు కావడమే కాకుండా లక్షల మందికి ఉపాది కల్పించారు.
కొత్త పారిశ్రామిక వాడల ఏర్పాటు…..
కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా స్థానిక ప్రజలకు కాలుష్య సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసింది.  రాష్ట్రంలో 1.5 లక్షల ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి పరిశ్రమలకు అవసరమైన నీటి పరఫరా, విధ్యత్‌ సరఫరా, రోడ్ల నిర్మాణం, ఇతర మౌళిక వసతులను సమకూరుస్తూ ఇండస్ట్రియల్‌ పార్కులను రూపొందించింది. తెలంగాణ స్టెట్‌ ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ కార్పోరేషన్‌ ఆద్వర్యంలో పరిశ్రమలకు అవసరమైన అన్ని వసతులను సమకూరుస్తూ రాష్ట్రంలో ఇప్పటి వరకు 109 పార్కులు ఏర్పడ్డాయి. మరో ఐదు సంవత్సరాలలో 70 పార్కుల రూపకల్పనకు ప్రణాళిక సిద్దమయింది.
ఇండస్ట్రియల్‌ పార్కుల ఏర్పాటు తో లక్షల మంది కి ఉపాది తెలంగాణ ప్రభుత్వం 2014వ సంవత్సరం నుండి 2023వ సంవత్సరం వరకు ఈ పార్కుల ఏర్పాటుకు కోట్ల రూపాయలు వెచ్చించింది.  అన్ని మౌళిక వసతులతో తీర్చిదిద్దిన 7806 ఎకరాల స్థలాన్ని 3680 సంస్ధలకు కేటాయించింది. ఇక్కడ ప్రారంభమైన పరిశ్రమల ద్వారా ద్వరా 2,63,222 మందికి ఉపాది అవకాశాలు లభించాయి. చిన్న`మధ్య తరహా పారిశ్రామిక వేత్తల కోసం రాష్ట్ర ప్రభుత్వం దండు మల్కాపూర్‌ గ్రామం వద్ద ఎమ్‌ ఎస్‌ ఎమ్‌ ఇ పథకం ద్వారా 570 ఎకరాలలో గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కును రూపొందిస్తోంది. ఇక్కడ 4 వేల మంది చిన్న`మధ్య తరహా పారిశ్రామిక వేత్తలు రూ.1,200 కోట్ల రూపాయల పెట్టు బడులతో తమ వ్యాపారాలు ప్రారంభించనున్నారు. ఈ పరిశ్రమల ద్వారా మరో 15 వేల మందికి ఉపాది అవకాశాలు లభించనున్నాయి.రైతుకు మద్దతు ధర కోసం ప్రత్యేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ లు ఏర్పాటుతెలంగాణలో ఆహార దాన్యాలు ఉత్పత్తి అధికంగానే ఉంటుంది. ఇక్కడ పండిన పంటలు దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి.  రైతులు తమ పంటను  మార్కెట్‌ కు  తరలించేందుకు ప్రభుత్వం మెరుగైన రోడ్డు మార్గాలను ఏర్పాటు చేసింది.  మద్దతు ధర వచ్చే వరకు పండిన పంటను దాచుకునేందుకు గిడ్డంగుల సదుపాయం కల్పించింది. ఇలాంటి పంటలను ప్రాసెసింగ్‌ చేసి విదేశాలకు ఎగుమతి చేసే సంస్ధలు తెలంగాణలోనే తమ ఫ్యాక్టరీలు స్థాపించడం ద్వారా తెలంగాణ రైతులకు మద్దతు ధరలు లభిస్తాయనే సదుద్దేశంతో రాష్ట్రంలోని 9 జిల్లాలలో ఈ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ లను అభివృద్ది చేసింది.
ఐటి పరిశ్రమలకు ప్రత్యేక స్థానంప్రస్తుత పోటీ ప్రపంచంలో ఐటి పరిశ్రమలు తమ సత్తాచాటు తున్నాయి. ఇలాంటి తరుణంలో ఐటి పరిశ్రమలు తెలంగాణలో ఏర్పాటు అయితే ప్రపంచ దేశాలలలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుందనే సంకల్పంతో టి`హబ్‌ ను ఏర్పాటు చేశారు.  టి`హబ్‌ ద్వారా ప్రపంచ ఐటి సంస్థలు తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించేదుకు అవసరమైన అన్ని వసతులు, అణుమతులు అందిస్తారు.  టిస్‌ ఐ సి సి ఆద్వర్యంలో తెలంగాణలోని అన్ని ముఖ్య పట్టణాలలో ఐటి టవర్స్‌ ను ఏర్పాటు చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌, మైక్రోసాఫ్ట్‌, అధాని,  సిటి ఆర్‌ ఎల్‌ ఎస్‌, ఎన్‌ ఎక్స్‌ టి ఆర్‌ ఎ వంటి సంస్థలు రూ. 33,881 కోట్ల రూపాయల పెట్టుబడులతో తెలంగాణలో తమ డేటా సెంటర్‌ లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం వారికి అవసరమైన తన్ని వసతులను సమకూర్చింది.
అనుమతుల  ప్రక్రియ సులభతరం:
తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగవలసిన అవసరం లేకుండా పారిశ్రామిక వేత్తలు తమ కార్యాలయంలోనే కూర్చిని పని ముగించుకునే విధంగా టిస్‌ ఐ పాస్‌ విధా