*పాలమాకుల గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి- సర్పంచ్ సుష్మ రాజ్ భూపాల్ గౌడ్*
రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి)* : పాలమాకుల గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ సుష్మ రాజ్ భూపాల్ గౌడ్ కోరారు.
పాలమాకులలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించడానికి వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డికి సర్పంచ్ సుష్మా రాజ్ భూపాల్ గౌడ్ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల స్థలము కబ్జాకు గురికాకుండా మరియు విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాఠశాల చుట్టు ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలన్నారు. పాలమాకుల గ్రామపంచాయతీ పెద్ద గ్రామపంచాయతీ అని గ్రామంలో 6 అంగన్వాడి కేంద్రాలకు సొంత భవనాలు లేనందున అట్టి అంగన్వాడి కేంద్రాలకు నూతన భవనాలు మంజూరు చేయాలి అన్నారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల, మోడల్ స్కూల్, గురుకుల పాఠశాల మరియు కస్తూర్బా బాలికల పాఠశాలలో పారిశుద్ధ్యం చేయడానికి సిబ్బంది కొరత ఉంది దీనిని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ కార్మికులను నియమించాలి. వరద నీరు వెళ్లేందుకు ట్రాంక్ లైన్ ఏర్పాటు చేయాలి. దీనికి మంత్రి సబితా రెడ్డి స్పందించి అధికారులతో చర్చించి నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారన్నారు.
ఫోటో రైటప్ : మంత్రి సబితా రెడ్డికి వినతి పత్రం అందజేసిన సర్పంచ్ సుష్మా రాజ్ భూపాల్ గౌడ్.
Attachments area