పాస్‌పుస్తకాల్లో పట్టాదారు పేరు మాత్రమే
కోటి ఎకరాలకు నీరివ్వడమే లక్ష్యం
చెక్కుల పంపిణీలో ఇబ్బందులు రాకుండా చూస్తాం
ధనిక రైతులున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవాలి
అగ్రకుల పేదలకూ పథకాలు ప్రకటిస్తా
జూన్ 2 నుంచి కొత్త రిజిస్టేష్రన్ విధానం అమలు : సీఎం కేసీఆర్
కరీంనగర్,మే10(జనం సాక్షి): పట్టాదార్ పాస్‌పుస్తకాల్లో పట్టాదారు పేరే ఉంటుంది కానీ అనుభవదారు పేరుండదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పంట రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లో పాస్‌బుక్కులు తీసుకోవద్దన్నారు. కౌలు రైతులకు డబ్బు ఇవ్వమని కూడా సీఎం తెలిపారు. హుజురాబాద్ లో రైతు బంధు పథకం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగిస్తూ..కోటి 40 లక్షల ఎకరాల పైచిలుకు భూమి సాగుకు అనుకూలంగా ఉందని తేలింది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, కేసులు వేసినా కోటి ఎకరాలకు సాగునీరివ్వడమే తమ లక్ష్యమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అగ్రకులాల పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నామని.. వారికోసం పథకాలు ప్రారంభిస్తామని చెప్పారు. రాజకీయ స్వార్థం కోసం విపక్ష నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. /ూష్ట్ర వ్యాప్తంగా సబ్సిడీ గొర్రెల పథకం విజయవంతమైందన్నారు. సబ్సిడీ గొర్రెల వల్ల యాదవులు ఇప్పటికే రూ.1000 కోట్లు సంపాదించారని చెప్పారు. మత్స్యకారులకు మరబోట్లు, వలలు ఇస్తామన్నారు. కేసీఆర్ కిట్ల ద్వారా ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయని తెలిపారు. పథకాలు విజయవంతం చేయడానికి ఉద్యోగులు కష్టపడుతున్నారని ప్రశంసించారు. వ్యవసాయం దండగ కాదు.. పండగ అని నిరూపిస్తామన్నారు. తెలంగాణ సాధించిన పార్టీ టీఆర్‌ఎస్సేనని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణను వేధించిన పార్టీ మాత్రం కాంగ్రెస్ అని
ఆరోపించారు. అభివృద్ధి ఫలాలు అందుకుంటున్న ప్రజలు న్యాయం వైపే ఉంటారని కేసీఆర్ చెప్పారు.
చెక్కులు అందజేయడంలో ఇబ్బందులుంటే తమకు తెలియజేయాలని రైతులకు సీఎం సూచించారు. నిధులు దుర్వినియోగం కావొద్దు..డబ్బు రైతుకే అందాలని, రైతు సమన్వయ సమితి సభ్యులు చెక్కుల పంపిణీలో ఇబ్బందులను పరిష్కరించాలని సీఎం నిర్దేశించారు. టీఆర్‌ఎస్ పాలనలో రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేశాం. రైతులకు బీమా చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం పునరుద్ఘాటించారు. జూన్ 2 నుంచి రైతులకు 5లక్షల బీమా అమలు చేయనున్నట్లు తెలిపారు. దేశంలో ధనికులైన రైతులున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవాలని సీఎం ఆకాంక్షించారు. రెండు, మూడు నెలల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తామన్నారు. కరీంనగర్ జిల్లాలో పసిడి పంటలు పండుతాయి. అగ్రకులాల్లోని పేదలకు కూడా తగిన స్కీములు ప్రకటిస్తమన్నారు. అలాగే జూన్ 2 నుంచి కొత్త రిజిస్టేష్రన్ విధానం అమలు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. సబ్‌రిజిస్టార్ర్ ఆఫీసులు పోను మిగతా 430 మండలాల్లో ఎమ్మార్వోలే రిజిస్టేష్రన్ చేస్తారని సీఎం తెలిపారు. పోస్టులోనే రిజిస్టేష్రన్ కాగితాలు, పాస్‌బుక్కులు ఇంటికొస్తయన్నారు. నీటి తీరువా బకాయిలు రద్దు చేసినమని, కనివినీ ఎరగని రీతిలో భూరికార్డుల ప్రక్షాళన చేసినమని అన్నారు. 58 లక్షల మంది రైతులకు పాస్‌బుక్కులు, పంట పెట్టుబడి సాయం అందిస్తున్నం. ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక ఏఈవోను నియమించామని సీఎం తెలిపారు. వ్యవసాయం పండగ అని తెలంగాణ చేసి చూపెట్టాలని రైతులకు సూచించారు. 60 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ మనల్ని గోసపెట్టింది. తెలంగాణ సాధించిన పార్టీ టీఆర్‌ఎస్..తెలంగాణను వేధించిన పార్టీ కాంగ్రెస్ అని సీఎం ఆరోపించారు. తెలంగాణ సాధన కోసం మొట్టమొదట సంహగర్జన కరీనంగర్ నుంచే మొదలు పెట్టామని తెలియాజేశారు. 14 ఏళ్లలో ఏ పోరాటం తలపెట్టినా కరీంనగర్ జిల్లా ఆత్మగౌరవ బావుటా ఎగురవేసిందన్నారు. కరెంట్ రాదు.. విూకు తెలివిలేదు.. విూకు పాలనరాదని కొందరు పిల్లి శాపాలు పెట్టారని ఆయన గుర్తు చేశారు. తెలివిలేనిదే సివిల్స్ లో ఆలిండియాలోనే కరీంనగర్ బిడ్డ అనుదీప్ నెంబర్ వన్ ర్యాంక్ కోట్టాడ అని ఆయన ప్రశ్నించారు. 29 రాష్టాల్లో అన్ని వర్గాలలకు 24 గంటల విద్యుత్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేని సూచించారు. రైతుకు పెట్టుబడి సాయం చేసిన గౌరవం తమ ప్రభుత్వానికి దక్కిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. 2014కు ముందు కరెంట్ ఉంటే వార్తా.. ఇప్పుడు కరెంట్ పోతే వార్త అని పేర్కొన్నారు. వ్యవసాయం బాగుండాలంటే భూముండాలి భూమి బాగుండాలంటే నీళ్లుండాలి.. కరెంట్ ఉండాలని తెలిపారు. రైతులకు ఇచ్చే డబ్బు రూ. 6 వేల కోట్లు బ్యాంక్ లో ఉందని సూచించారు. జాతీయ ఉపాధి హావిూ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని సూచించారు. కాంగ్రెస్ వాళ్ల మాటలు వింటే ఆగమవుతారు జాగ్రత్తగా ఉండాలని రైతులకు సూచనలు ఇచ్చారు. ఆంధ్రా నాయకుల టి కాంగ్రెస్ నేతలు తొత్తులుగా ఉండి వ్యవసాయాన్నినాశనం చేస్తున్నరని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం నీళ్లుతో మూడు పంటలు పండించుకోబోతున్నామని వెల్లడించారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధికి రూ.500 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.