: పిట్ ఇండియా – 2కె ఫ్రీడం రన్ ను ప్రారంభించిన – ఎస్సై ఉపేందర్

గంగారం ఆగస్టు11(జనంసాక్షి):
75 వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా  గంగారం మండల కేంద్రంలో ఎస్సై ఉపేందర్ మరియు ఎమ్మార్వో సూర్యనారాయణ  కలిసి 2కె ఫ్రీడం రన్ ను జాతీయ జెండా ఊపి ప్రారంభించారు.ఈ రన్ గంగారం మండల కేంద్రం నుండి  కొనసాగించారు. ఈ సందర్భంగా ఎస్సై ఉపేందర్  మాట్లాడుతూ నేటి భావితరాలకు మనం వేసే ప్రతి అడుగు స్ఫూర్తి దాయకంగా నిలవాలని అన్నారు. ఆయురారోగ్యాలతో ఫిట్ ఇండియా లో భాగస్వాములు కావాలని యోగాతో మనిషి శరీరం ఆయురారోగ్యాలతో ఉంటుందన్నారు, యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది మన దేశం అన్నారు, కావున ప్రతి ఒక్కరూ ఈ పోటీ ప్రపంచంలో నిత్యం కష్టపడాలని ఆ కష్టానికి ప్రతిఫలం పొందే వరకు తమ శ్రమని తమ ప్రయత్నాన్ని ఆపకూడదాని ఈ సందర్భంగా ఎస్సై పిలుపునిచ్చారు. స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొందాం. మహాత్మా గాంధీ సిద్ధాంతాలను, స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటుదాం  అన్నారు.ఈ ఫ్రీడం రన్ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జడ్పిటిసి ఈసం రామా సురేష్, స్థానిక సర్పంచ్ చింత సారక్క,  కోదండ రామాలయం చైర్మన్ సైప సురేష్,  మండల అధికారులు ఎమ్మార్వో సూర్యనారాయణ, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, డాక్టర్ ముక్రం, ఎఫ్ ఆర్ వో చలపతిరావు, ఉపాధ్యాయులు,విద్యార్థులు,మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.