పి ఆర్ టి యు టి ఎస్ అధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినం.
ఏర్గట్ల సెప్టెంబర్ 1 ( జనంసాక్షి ): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పి ఆర్ టి యు టి ఎస్ ఎరుగట్ల మండల శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 ని పెన్షన్ విద్రోహ దినంగా నిర్వహించడ మైనది. సిపిఎస్ పెన్షన్ విధానం వలన ఉద్యోగ ఉపాధ్యాయుల భవిష్యత్తు భద్రత లేకుండా తీవ్రంగా నష్టపోతున్నారని ఇది పూర్తిగా మార్కెటు లావాదేవీలపై ఆధారపడి ఉన్నందున ఈ విధానాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు రద్దు చేశాయని ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ఏర్గట్ల మండల తహసిల్దార్ కు పిఆర్టియు టిఎస్ ఏర్గట్ల మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉపాధ్యాయులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శెర్ల శ్రీనివాస్,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బిజ్జు గోపి, కార్యదర్శి సుధాకర్,జిల్లా కార్యదర్శి రాజశేఖర్,మండల కార్యదర్శి సురేష్,మహిళా ఉపాధ్యక్షురాలు జె అర్పిత, రాష్ట్ర ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, కాంప్లెక్స్ హెచ్ఎం మునీరుద్దీన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.