పుజారా డబుల్ ధమాకా సౌరాష్ట్ర ఘన విజయం
రాజ్‌కోట్, జనవరి1: రంజీ ట్రోఫీలో అడుగు పెట్టిన పేస్ బౌలర్ ధర్మేంధ్ర సిన్హా జడేజా మంగళ వారం తొలి మ్యాచులోనే సత్తా చాటాడు. అద్భుత మైన బౌలింగుతో సౌరాష్ట్రకు మధ్యప్రదేశ్‌పై 227 పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు. రంజీ ట్రోఫీలో గ్రూప్ ఎ లో ఆఖరు నాలుగోరోజు మంగళవారం మధ్య ప్రదేశ్‌ను ఓడించి సౌరాష్ట్ర నాకౌట్ దశకు చేరుకుంది. మొదటి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడిన జడేజా మధ్యప్రదేశ్ రెండో ఇన్నిం గ్స్‌లో 26.4 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చిన ఆరు వికెట్లు తీసుకున్నాడు. అతనికి ఆఫ్‌స్పిన్నర్ కమల ేశ్ మక్వానా నుంచి మంచి మద్ధతు లభించింది. ఇతను 43 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకు న్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 242 పరుగులు చేసిన సౌరాష్ట్రను 135 పరుగులకూ పరిమితం చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. తద్వారా మధ్యప్రదేశ్ ముందు 411 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మంగళవారం రెం డు వికెట్ల నష్టానికి 89 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్ జట్టు మరో 94 పరు గులు జత చేసి 68.4 ఓవర్లలో ఆలవుట్ అయిం ది. జడేజా, మక్వానా బౌలింగ్‌ను మధ్య ప్రదేశ్ బ్యాట్స్‌మెన్‌లలో జలజ్ సక్సేనా(75), రమీజ్ ఖాన్ (31) మాత్రమే ధీటుగా ఎదుర్కోగలిగారు. సక్సేనా , ఖాన్ మూడో వికెట్‌కు 85 పరుగులు జోడిం చారు. ఆసమయంలో మధ్యప్రదేశ్ మ్యాచ్‌ను రక్షించి కుంటుందనే భావనకలిగింది. జడేజా బౌ లింగ్‌లో ఖాన్ అవుట్‌కావడంతో మిగతా బ్యాట్స్ మెన్ పెవిలియన్‌కు వరుసకట్టారు. నాకౌట్ దశకు చేరుకునేందుకు మధ్యప్రదేశ్‌కు మూడు పాయిం ట్లు మాత్రమే కావాల్సిఉండగా, సౌరాష్ట్రకు మ్యాచు ను తప్పనిసరిగా గెలుచుకోవాల్సిన పరిస్థితి ఉండింది. ఈ కీలక స్థితిలో పుజారా డబుల్ సెంచరీ సౌరాష్ట్రను నాకౌట్ దశకు చేర్చింది.