పురుగుల మందు తాగి రైతు అత్మహత్య

గోదావరిఖని(పట్టణం) : రామగుండం మండలం ఎల్కపల్లి గ్రామానికి చెందిన చిట్టబోయిన శ్రీనివాస్‌ (30) అనే రైతు అత్మహత్యకు పాల్పడ్డాడు. తన పోలంలోని వ్యవసాయ పంపుసెట్టు మోటారు కాలిపోవడంతో అందోళనకు గురై పురుగులమందు తాగి అత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. జ్యోతి నగర్‌ పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.