పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు(19):రేవల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన మగ్ధం రాములు తండ్రి పేరు చిన్నయ్య వయసు 40 సంవత్సరాలు బలవన్మరణం చెందినట్లు ఎస్సై నవీద్ తెలిపారు మృతుని వివరాల్లోకెళ్తే వృత్తి రీత్యా లారీ డ్రైవర్ గా పని చేసుకుంటూ మధ్యానికి బానిసై ప్రతిరోజు మద్యం తాగుతూ గ్రామంలో ఎలాంటి పని చేయకుండా ఉండేవాడు ఈనెల14వ తేదీన ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇంటి నుండి బయలుదేరి తాగిన మైకంలో పురుగుల మందు తాగి గోపాల్ పేట్ గ్రామ శివారులో కమ్యూనిటీ భవనం శిలాఫలకం దగ్గర అపస్మారక స్థితిలో ఉండగా అటు నుంచి వెళ్తున్న అదే గ్రామానికి చెందిన బొక్కలయ్య రాములు ను ఆటోలో వనపర్తిప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి మృతుని భార్య జ్యోతి కి సమాచారం ఇవ్వగా మెరుగైన చికిత్స కోసం మహబూబ్ నగర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తూ ఉండగా ఈనెల 18వ తేదీన (శుక్రవారం) సాయంత్రం చనిపోయాడు మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గోపాల్ పేట్ ఎస్సై నవీద్ తెలిపారు