*పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య*
*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (22):* పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని ఏదుట్ల గ్రామ శివారులో చోటు చేసుకుంది ఎస్సై నవీద్ కథనం మేరకు పాన్ గల్ మండలం రేముద్దుల గ్రామానికి చెందిన ఎం రాజు (28) భార్య రమాదేవి గత సంవత్సరం వచ్చింది వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు భార్య మృతి చెందడంతో రాజు మరో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించగా ఎవరు ముందుకు రాకపోవడంతో ఒంటరి వాడినయ్యాననే బాధతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు బుధవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి మండలంలోని ఏదుట్ల శివారులో కుమ్మరి చిన్న బుచ్చన్న పొలంలో పురుగుల మందు తాగి అక్కడికక్కడే మృతి చెందాడు గురువారం సంఘటన స్థలానికి వెళ్ళిన పోలీసులు పంచారామ నిర్వహించారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు