పెండింగ్ స్కాలర్ షిప్ లు వెంటనే విడుదల చేయాలని

ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు
చేర్యాల (జనంసాక్షి) జులై 11 : పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ స్కాలర్ షిప్ లు వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు ఓ ప్రకటనలో తెలిపారు. స్కాలర్షిప్స్, ట్యూషన్ ఫీజులను కొన్ని సంవత్సరాలుగా విడుదల చేయకపోవడంతో విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేసినా సర్టిఫికెట్లు చేతికి రావడం లేదని, మరోవైపు అప్పులు తెచ్చి కళాశాలలు నిర్వహించడానికి యాజమాన్యలు నానా తంటాలు పడుతూ విద్యార్థులను ఇబ్బందిపెడుతున్నాయని, బిసి విద్యార్థులకు సర్కారే ట్యూషన్ ఫీజులు, స్టేఫండ్ ఇవ్వాల్సి ఉండగా గత రెండేళ్లుగా ఏదో ఒక సాకుతో వీటి చెల్లింపులు నిలిపివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 9.25 లక్షల మంది బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్, ట్యూషన్ ఫీజులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇప్పటికె 2022-23 విద్యాసంవత్సరానికి దోస్త్ నోటిఫికేషన్ కూడా విడుదల అయినా గత విద్యా సంవత్సరానికి సంబందీంచిన ఫీజు రీయంబార్స్ మెంట్ విడుదల చేయకపోవడంతో కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లు రాకపోవడంతో చదువులు, ఉద్యోగాలకు దూరమవుతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ట్యూషన్ ఫీజులు, స్కాలర్షిప్ లు విడుదల చేయాలని, లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉదృతం