పెట్రోల్ ధరలకు నిరసనగా రాస్తారోకో
కరీంనగర్,జూన్20(జనం సాక్షి ): పెరిగిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం సైదాపూర్ మండలకేంద్రంలోని కొత్త బస్టాండ్ ఏరియాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఐ మండల కార్యదర్శి గుండేటి వాసుదేవ్ మాట్లాడుతూ.. కేందప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలు పెంచి సామాన్యులపై భారం మోపిందన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు దాసరి రవి, సైదయ్య, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.