పెద్దపల్లిలో ఘనంగా మహాత్మగాంధీ జయంతి వేడుకలు
కరీంనగర్: పెద్దపల్లిలో మహాత్మగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు పార్టీల నాయకులు గాంధీ విగ్రహానికి పాలభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాసవీ క్లబ్ వనిత సభ్యలు అనాధలకు దుస్తులు పంపిణీ చేశారు. పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో లైన్స్‌క్లబ్ సభ్యలు పాలు, పండ్లు పంపిణీ చేశారు.