పెర్త్ వన్డేలో విండీస్ చిత్తు
పెర్త్,ఫిబ్రవరి 1: ఆస్టేల్రియా పర్యటనను కరేబియన్ టీమ్ ఘోరపరాజయంతో ఆరంభించింది. పెర్త్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో ఆసీస్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ అనూహ్యంగా కుప్పకూలింది. ఆసీస్ పేసర్ మిఛెల్ స్టార్క్ ధాటికి విండీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. గేల్ 4 , పావెల్ 11 , డారెన్ బ్రావో 11 పరుగులకు ఔటవగా… శర్వాణ్ , డ్వయాన్ బ్రేవో , కిరణ్ పొల్లార్డ్ డకటయ్యారు. ఆ జట్టులో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ నమోదు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మొత్తం నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌటయ్యారు. ఒక దశలో 39 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన విండీస్ తమ వన్డే చరిత్రలో అత్యల్ప స్కోర్ నమోదు చేసేలా కనిపించింది. అయితే డారెన్ సామి కాసేపు క్రీజులో నిలవడంతో విండీస్ స్కోర్ 60 దాటింది. స్టార్క్‌తో పాటు మెక్‌కే , ఫాల్కనీర్ కూడా అదరగొట్ట డంతో వెస్టిండీస్ 23.5 ఓవర్లలో 70 పరుగులకు ఆలౌటైంది.ఆస్టేల్రియాపై కరేబియన్లకు ఇదే అత్యల్ప స్కోర్.ఆసీస్ బౌలర్లలో మిఛెల్ స్టార్క్ 5 , మెక్‌కే 3 , ఫాల్కనీర్ 2 వికెట్లు తీసుకున్నారు. 71 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్టేల్రియా మ్యాక్స్‌వెల్ ఇచ్చిన ఆరంభంతో త్వరగానే విజయాన్ని అందుకుంది. కేవలం ఫించ్ వికెట్ మాత్ర మే కోల్పోయి 9.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ధాటి గా ఆడిన మ్యాక్స్ వెల్ 35 బంతుల్లో 9 ఫోర్లు , 2 సిక్స ర్లతో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిఛె ల్ స్టార్క్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. ఈ విజయంతో ఆసీస్ ఐదు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. సిరీస్‌లో రెండో వన్డే ఆదివారం పెర్త్‌లోనే జరుగుతుంది.