పేదలకు భూములను ఇవ్వాల్సిందే

11వ రోజుకు చేరిన ధర్నాలు
నిజామాబాద్‌,ఆగస్ట్‌17(జనం సాక్షి): కందకుర్తి రైతులు తమ భూముల కోసం చేస్తున్న ధర్నా 11వ రోజుకు చేరింది.  తమ పట్టాలు ఇచ్చేంత వరకు తమ న్యాయ పోరాటం చేస్తామని వారన్నారు. తహసీల్దార్‌ కార్యాలయం ముందు వారు ధర్నా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే 127 మంది రైతులకు సంబంధించినటువంటి భూముల పట్టాలను వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో ఆందోళన కా ర్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు.పేద ముస్లింలు, దళితులు, బీసీల భూములు లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది సరియైన చర్యకాదని ఆరోపించారు. 1954లో ఇనాం పేరిట అప్పట్లో దళితులకు, మైనా ర్టీలకు, బీసీలకు ప్రభుత్వం భూములు ఇచ్చిందని అయితే వాటికి సంబంధించిన అన్ని కూడా 1994లో పట్టాలు చేసిందని ఆయన అన్నారు. ప్రభుత్వం వివిధ పథకాల పేరిట రైతులకు భూములు పంచేదిపోయి లాక్కునే ప్రయత్నాలు చేస్తుందని, ఇది అందులోనే భాగమని ఆయన అన్నారు.