పేదల అభ్యున్నతియే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం…

ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్

కేసముద్రం జనం సాక్షి /రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అభిప్రాయపడ్డారు.శుక్రవారం రోజున మండల కేంద్రంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.మండలం లోని తెరాస పార్టీ కార్యాలయం లో సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందజేశారు,అనంతరం కొమ్ము రాహుల్ యొక్క హెచ్ డి ఫ్లెక్స్ ప్రింటింగ్ సెంటర్ ను ఘనంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి, అమినాపురం,గాంధీనగర్,కల్వల గ్రామ లబ్ధిదారులకు నూతన ఆసరా పెన్షన్ కార్డులను అందజేసి,కల్వల గ్రామస్తుడు ఎస్ పురుషోత్తం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించడం,కొత్తూరు కు చెందిన టిఆర్ఎస్ నాయకులు సారంపల్లి వెంకటరెడ్డి,మోహన్ రెడ్డి తండ్రి దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ…. ఆరోగ్య శ్రీ పథకం ద్వారానే కాకుండా ఆరోగ్య శ్రీ పథకం వర్తించని వ్యాదులకు, పేదలను ఆదుకోవడం కోసం సిఎం కెసిఆర్ లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నారన్నారు.
ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దేశం లో ఎక్కడలేని విధంగా మన రాష్ట్రము లో ప్రజాకర్షక పథకాలను రూపకల్పన చేసిన సిఎం కెసిఆర్ ప్రజా క్షేమమే లక్ష్యంగా, బంగారు తెలంగాణ నిర్మాణమే ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో..
ఎంపిపి చంద్ర మోహన్, జెడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, మార్కుఫెడ్ డైరెక్టర్ మర్రి రంగా రావు, మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణ రావు, నజీర్ అహ్మద్, మాదారప�