పేదల అవసరాలే బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో

` దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే దళిత బంధు పథకం
` మారెమ్మ కుంట నుండి గాంధీ నగర్‌ వరకు ఎన్నికల ప్రచారం
` రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
వనపర్తి బ్యూరో (జనంసాక్షి):పేద బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తుందని, పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో కూడా ప్రజల అవసరాలు, అభ్యున్నతి లక్ష్యంగా రూపొందించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం మారెమ్మ కుంట నుండి గాంధీ నగర్‌ వరకు ఎన్నికల ప్రచారంను నిర్వహించారు. ప్రతి గడపకు గడపకు వెళ్లిన సందర్భంలో ప్రజలు మంత్రి నిరంజన్‌ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ  ఆప్యాయంగా మాట్లాడారు. విూ వెంటే మేమంతా ఎల్లప్పుడూ ఉన్నామని ఉంటామని మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది భారీ మెజారిటీ అందించి విూకు బహుమతిగా ఇస్తామని ప్రజలు మంత్రి నిరంజన్‌ రెడ్డితో తమ అభిమానాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి , బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఎదురు వెళ్లి పెట్టుబడి సాయాన్ని అందిస్తూ పండిన పంటను సైతం కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అని , రాబోయే 5 ఏండ్ల కాలంలో రైతుబందు ను 10 వేల నుండి 16 వేల కు పెంచుతామన్నారు. సౌభాగ్య లక్ష్మీ పథకం కింద అర్హులైన మహిళలందరికి నెలకు రూ 3 వేలు , వచ్చే ఏడాది ఏప్రిల్‌ ` మే నెల నుండి పేదలందరికి రేషన్‌ కార్డులపై సన్నబియ్యం సరఫరా , స్వశక్తి మహిళా సంఘాలకు దశల వారిగా స్వంత భవనాల నిర్మాణం చేపడుతామని మంత్రి వివరించారు. రూ 200 పింఛన్‌ నుండి రూ 2016 లకు పెంచి ఆసరా పింఛన్‌ ద్వారా ఆసరాగా నిలిచారన్నారు. దళితులను గత ప్రభుత్వాలు కేవలం ఓట్ల కోసమే వదుకున్నారని ఎన్నడూ వల్ల అభివృద్ధి కోసం ఆలోచించిన పాపాన పోలేదన్నారు. దళితులు ఆర్థికంగా ఎదగాలని, అప్పుడే సమాజంలో ఉన్నతంగా ఉంటారని సీఎం కేసీఆర్‌ ఆలోచన నుండి పుట్టింది దళిత బంధు పథకం అని వారికి నచ్చిన రంగాల్లో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి వారి ఆర్థికంగా ఎదిగేందుకు పాటు పడుతున్నామని నాడు ఒకరి కింద పని చేస్తే దగ్గర నుండి ఓనర్‌ స్థాయి వరకు ఎదిగారని మంత్రి గుర్తు చేశారు. వనపర్తిని జిల్లా చేయడమే కాకుండా పరిపాలన భవనాల నిర్మాణం, నూతన ఉన్నత విద్యాసంస్థల రాకతో రాబోయే ఐదేళ్లలో పట్టణం పెద్ద ఎత్తున విస్తరిస్తుందని అన్నారు. రహదారుల విస్తరణతో పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ పెట్టామని, జరుగుతున్న అభివృద్ది మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు మరోసారి ఆశీర్వదించి, అండగా నిలవాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో మంత్రి వెంట జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్‌ గారు, రాష్ట్ర సహకార యూనియన్‌ సభ్యులు తిరుమల మహేష్‌ గారు,  జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్‌ గారు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పట్టణ పార్టీ అధ్యక్షుడు రమేష్‌ గౌడ్‌, పట్టణ ఎన్నికల సమన్వయ కర్త అరుణ్‌ ప్రకాష్‌ గారు, రాష్ట్ర మార్కుఫెడ్‌ డైరెక్టర్‌ విజయ్‌, జిల్లా సమన్వయ సభ్యులు రాములు యాదవ్‌, స్థానిక వార్డు కౌన్సిలర్‌ సత్యమ్మ శరవంద, కౌన్సిలర్లు పాకనాటి కృష్ణయ్య, బండారు కృష్ణ, పుట్టపాకుల మహేష్‌, విూడియా సెల్‌ కన్వీనర్లు నందిమల్ల శ్యామ్‌, అశోక్‌, నాయకులు పరంజ్యోతి, గంధం విజయ్‌, మంద రాము,  కృష్ణ యాదవ్‌, రహీం, తిరుమల్‌, గులాం ఖాదర్‌, బాలరాజు, మురళి సాగర్‌, బిస్థి శ్రీను, ఉస్మాన్‌, ముని కుమార్‌, బొడ్డుపల్లి సతీష్‌ కుమార్‌, గౌస్‌, గౌసి కూరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు