పేదల జీవితాల్లో మార్పులేదు

C

– పిల్లల్ని చదివించండి

– రిక్షావాలకు అండగా ఉంటా

– ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌18(జనంసాక్షి):

ఎన్నో సంవత్సరాలపాటు దేశాన్ని పాలించినా.. పేదల జీవితాల్లో కాంగ్రెస్‌ ఎలాంటి మార్పు తీసుకురాలేకపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం ఆయన  తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఆయన మా ట్లాడుతూ ‘గరీబీ హటావో'(పేదరికాన్ని నిర్మూలిద్దాం) అంటూ నినా దాలు చేసిన కాంగ్రెస్‌.. ఆచరణలో అమలు చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. కనీసం పేదలకు బ్యాంకు ఖాతా కూడా తెరవ లేకపోయిందని విమర్శించారు. వాళ్లు 50ఏళ్లలో చేయలేని పనులను తాను 50 నెలల్లో చేసి చూపిస్తానని మోదీ అన్నారు. ‘జన్‌ధన్‌ యోజన’ పథకం కింద పేదల చేత బ్యాంకు ఖాతాలు తెరిపించినట్లు ఆయన గుర్తు చేశారు. తాను ఏ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడటం లేదని, కాకపోతే పేదరిక నిర్మూలనపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బ్యాంకుల జాతీయీకరణ జరిగి ఇప్పటికి 25 సంవత్సరాలు గడిచిందని.. కానీ ఇంతవరకు పేద ప్రజలకు వాటి సేవలు అందని ద్రాక్షగానే మిగిలాయని ఆయన పేర్కొన్నారు.  మనం మన పిల్లలకు విద్య నేర్పితే ఇక భూమిపై ఏ శక్తి మనల్ని ఆపలేదు.అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పేదరికాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించగల శక్తి ఒక్క విద్యకు మాత్రమే ఉన్నదని చెప్పారు. శుక్రవారం ఆయన తన నియోజకవర్గం వారణాసి వెళ్లా రు. ఈ సందర్భంగా 501మందికి రిక్షాలు పంపిణీ చేయ డంతోపాటు 101 ఈ రిక్షాలను (బ్యాటరీతో నడిచేవి) కూడా పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నా ప్రభుత్వం ఏకైక లక్ష్యం ఒక్కటే.. ప్రతి పేద స్వయం శక్తిగల సమృద్ధిడిగా ఎదగడం. చాలా ఏళ్లుగా మనం గరీబీ హటావో అనే ఒక నినాదం వింటున్నాం. ప్రజా సంక్షేమం గురించి రాత్రి పగలు మాట్లాడు కోవడం ఒక సంప్రదాయంగా మార్చారు. కానీ, వారి జీవితాల్లో కొంత మార్పే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా పేదలు మరింత సంపాధించుకోగలుగుతారు. రిక్షావాలాలకు ఈ సంద ర్భంగా ఒకే విషయం చెప్పదలుచుకున్నాను. విూరు ఎట్టి పరిస్థితుల్లో పేదరికం కారణంగా పిల్లల విద్యను నిర్లక్ష్యం చేయోద్దు. వారికి విద్యను సరిగా నేర్పించారంటే ఇక మిమ్మల్ని ఎవరూ ఆపలేరు.

రిక్షవాలాలకు అండగా ఉంటా: మోడీ

తమది పేదల ప్రభుత్వమని,  వారణాసిలో రిక్షావాలాలను ఆదుకుంటామని మోదీ చెప్పారు. రిక్షావాలాలు తమ పిల్లలను బాగా చదివించాలని సూచించారు. పేదరిక నిర్మూలనకు ప్రధాన ఆయు ధం చదువే అని పేర్కొన్నారు. వారణాసిలో పవర్‌ ప్రాజెక్టుతో పాటు పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. వార ణాసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శం కుస్థాపన చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వార ణాసిలో రింగ్‌రోడ్డు నిర్మాణానికి

శంకుస్థాపన చేస్తున్నానని తెలిపారు. సవిూకృత విద్యుత అభివృద్ధి పథకాన్ని ప్రారంభిస్తున్నానని వెల్లడించారు. విమానాశ్రయం నుంచి కాశీ వరకు రహదారి విస్తరణ పనులు చేపడతామని ప్రకటించారు.