పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా సీఎం అర్ ఎఫ్
సీఎం అర్ ఎఫ్ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే సతీష్ కుమార్
జనంసాక్షి / చిగురుమామిడి – ఆగష్టు 23:
పేద ప్రజలు అనారోగ్యనికి గురైనప్పుడు వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో మందికి ఉపయోగ పడుతుందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం చిగురుమామిడి మండల పరిధిలోని 32 మందికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన 9 లక్షల 23వేల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.అనంతరం 13 మంది అర్హులకు 13 లక్షల 15 వందల 8 రూపాయల విలువ గల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ స్పష్టం చేశారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన అన్ని హామీలను నెర వేర్చారని అన్నారు. ఆసరా ఫింఛన్ , రైతుల కోసం రైతు బంధు. రైతు భీమా, 24 గంటలు ఉచిత కరెంట్ , పేదల కోసం షాదీ ముబారక్ , కళ్యాణ లక్ష్మి వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వాలు ఆడ పిల్లల పెళ్లిళ్ల కోసం ఆలోచించలేదు. ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయాలంటే తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా ఉండేది . కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆడపడుచులకు అండగా ఉంటు వారి పిల్లల పెళ్లిళ్లకు లక్ష నూట పదహారు రూపాయలు అందించి వారి కుటుంబంలో ఒకరిగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేనమామ కట్నంగా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని,
పేద మధ్య తరగతి కుటుంబాలకు పెళ్లి ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న లక్ష పదహారు వేల రూపాయలు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దనే సీఎం కేసీఆర్ ఈ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలియజేశారు.