పేద ప్రజల పెద్ద కొడుకు సీఎం కేసీఆర్ :ఎమ్మెల్యే మాణిక్ రావు

జాహిబాద్ సెప్టెంబర్ 22 (జనం సాక్షి)
కోహిర్ మండలం ఖానాపూర్ గ్రామం సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తూ తెలంగాణ ప్రజల గుండెల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద కొడుకుగా మారారని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు తెలిపారు. ఖానాపూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఆయన ఆసరా పెన్షన్లు అందజేశారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సహకారంతో ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడం ద్వారా బంగారు తెలంగాణ సాధించడమే టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నిధులు సరిపోక తెలంగాణ అభివృద్ధి వెనుకబడిందని,కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో స్వరాష్ట్రంలో మన నిధులను మనం వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రంలోని పల్లెలు పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావును గ్రామ సర్పంచ్ పెద్ద తోట రాములమ్మ ఘనంగా సన్మానించారు.గ్రామ ప్రజలు గ్రామం లోని సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే మాణిక్ రావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెద్దతోట రాములమ్మ ,ఎంపీడీఓ సుజాత నాయక్,పిఎసిఎస్ డైరెక్టర్ గొల్ల రాములు,ఎంపీటీసీ లావణ్య దుర్గాప్రసాద్,ఖానాపూర్ గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పెద్దతోట రమేశ్,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సింలు, ఆత్మ చైర్మన్ వెంకట్ రెడ్డి,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామకృష్ణారెడ్డి,టిఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్తకాపు గోవర్ధన్ రెడ్డి,ఖానాపూర్ గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షుడు కటికె నర్సింలు, ఉపాధ్యక్షుడు కవేలి అశోక్,ఉప సర్పంచ్ చెక్క చంద్రశేఖర్, నాయకులు ఎం బీ చ్చయ్య కృష్ణ పైడిగుమ్మల రాము ఒగ్గు రాజు పెద్దతోట రాచన్న, చెక్క మానయ్య మరియు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.