పేద మలయాళీలకు డబుల్‌ బెడ్‌రూంలు

C
– కేరళ భవన్‌కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

హైదరాబాద్‌  సెప్టంబర్‌ 20(జనంసాక్షి):

భారతదేశంలో నెంబన్‌ గా కేరళ భవన్‌ రావాలని కోరుకుంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ఆదివారం కేరళ భవన్‌ కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేరళ సీఎం ఉమెన్‌ చాందీ కూడా పాల్గొన్నారు. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో.. మలయాళీల సమ్మేళనంలో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి ఉమెన్‌ చాందీ కూడా హాజరయ్యారు. కార్యక్రమానికి ముందు నిర్వహించిన ఇరు రాష్ట్రాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ, కేరళ రెండూ సంప్రదాయాలతో అనుబంధమైన రాష్ట్రాలన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. హైదరాబాద్‌ లో అన్ని ప్రాంతాలవారు ఉన్నారని… అందులో మలయాళీలు.. ఇక్కడివారితో పూర్తిగా కలిసి పోయారని కితాబిచ్చారు. అందుకే హైదరాబాద్‌ సబ్‌ కా షహర్‌ అని పేరు తెచ్చుకుందన్నారు కేసీఆర్‌. తెలంగాణ రాష్ట్రంలో నిరక్షరాస్యత కోసం కృషి చేయడం జరుగుతోందన్నారు. కేరళ ఎంతో అందమైన ప్రదేశమని, కేరళలో ప్రాముఖ్యత కలదన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిందని, అభివృద్ధి కోసం తాము కృషి చేయడం జరుగుతోందన్నారు. కేరళ రాష్ట్రంతో సంబంధాలు కొనసాగుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మళయాలీలు మానవవాళికి సేవలందిస్తున్నారని, ఈ సేవలకు తాను గర్వపడుతున్నానని తెలిపారు. తాను ఎక్కువ సేపు మాట్లాడనని, పనిచేసి చూపిస్తానన్నారు. ఒకటి..ఒకటిన్నర సంవత్సరంలో దేశంలోనే నెంబర్‌ వన్‌ గా కేరళ భవన్‌ రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మళయాలీలకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ, సహాకారాలు అందచేస్తుందన్నారు. రాష్ట్ర పునర్‌ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.