పొన్నం కు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు

18నుండి హుస్నాబాద్ నియోజకవర్గంలో జరుగనున్న పొన్నం పాదయాత్రను విజయవంతం చేయండి:కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి చిటుమల్ల రవీందర్

జనంసాక్షి/చిగురుమామిడి – ఆగష్టు 16:
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేపట్టిన పాద యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి చిటుమల్ల రవీందర్ పిలుపునిచ్చారు. పొన్నం పాదయాత్రకు సంఘీభావం తెలుపడానికి మంగళవారం చిగురుమామిడి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చిటుమల్ల రవీందర్ సారథ్యంలో మానకొండూర్ నియోజకవర్గం గట్టుదుద్దెనపల్లి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా చిటుమల్ల రవీందర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పొన్నం ప్రభాకర్ నిర్వహిస్తున్న యాత్ర లో భాగంగా గట్టుదుద్దెనపల్లి ఫంక్షన్ హాల్ లో ప్రభాకర్ ను కలిసి సంఘీభావం తెలిపారు. ఈనెల 18న పొన్నం పాద యాత్ర హుస్నాబాద్ నియోజక వర్గంలో ప్రవేశిస్తున్న సందర్భంగా హుస్నాబాద్ నియోజక వర్గ పరిధి లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మైనార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. చిటుమల్ల రవీందర్ వెంట పొన్నం పాదయాత్ర కు సంఘీ భావం తెలుపడానికి వెళ్లిన వారిలో జిల్లా ఉపాధ్యక్షుడు బస్వరాజు శంకర్, జిల్లా అధికార ప్రతినిధి ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి, జిల్లా నాయకులు దాసరి ప్రవీణ్ కుమార్ నేత, ములుకనూరు గ్రామశాఖ అధ్యక్షుడు పూదరి వేణు తదితరులున్నారు.