పోచమ్మ తల్లి ఆలయంలో సదా వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు
రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం, (జనం సాక్షి):- ఆలయాలు మానసిక ఉల్లాసానికి ప్రశాంతతకు దోహదపడుతూ సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతుందని జ్ఞాన సరస్వతి ఆలయ వ్యవస్థాపకులు సదా వెంకటరెడ్డి అన్నారు. శనివారం యాచారం మండలం పరిధిలోని నందనంపర్తి గ్రామంలో పునర్మించిన పోచమ్మ తల్లి ఆలయంలో వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ విజయ్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నందివనపర్తి దేవాలయాల పునర్మానంతో ఆలయాలకు నిలయంగా మారిందని ఉన్నారు. ఆధ్యాత్మిక చింతన తోనే మానసిక వికాసం కలుగుతుందన్నారు. ఆలయాల నిర్మాణాలకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని గుర్తు చేశారు. మన సాంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలంటే ఆలయాల పునర్నిర్మాణం జరగాలని అందులో యువత భాగస్వాములు అయితే సమాజంలో ఐక్యత సామూహిక సమిష్టి కృషి జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నిరుపేద విద్యార్థుల యువతకు జ్ఞాన సరస్వతి ఆలయం ద్వారా విద్యను అభ్యసనలో వ్యయానికి ప్రోత్సాహం ఉంటుందని అన్నారు. ఇబ్రహీంపట్నం చెరువు కట్ట పై నిర్మించబోయే అఖండ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కోసం చేపట్టే కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విగ్రహ నిర్మాణం వేయం లో విద్యార్థుల భాగస్వాము అధికంగా ఉంటుందన్నారు. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు నిండాలని గతంలో నూట ఒక కొబ్బరికాయ కొట్టిన విషయం గుర్తు చేశారు. పెద్ద చెరువు అలుగు పారుతున్న సందర్భంగా వేయి కొబ్బరికాయలతో హారతి పలకనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు రామనాథం,గ్రామస్తులు గోగికర్ రమేష్, ఆలయ కమిటీ సభ్యులు రవీందర్,కాలే యాదయ్య, ఆంజనేయులు, అలెగ్జాండర్,యాదగిరి,అనిల్ కుమార్, క్రాంతి గ్రామస్తులు శ్రీశైలం, బాలరాజ్, తదితరులు పాల్గొన్నారు.