పోడు భూములకు సంబందించిన ఆన్లైన్ దరఖాస్తులను ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేసి పరిష్కరించాలి…
—-జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు….
హన్మకొండ బ్యూరో చీఫ్ 7అక్టోబర్ జనంసాక్షి
శుక్రవారం నాడు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హల్ లో ఫారెస్ట్, రెవెన్యూ , పంచాయితీ గిరిజన శాఖ అధికారు లతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోడు భూములను పరిష్కరించుటకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. అటవీ సంపదను కాపాడుకోవడంతో పాటు, భవిష్యత్తులో అటవీ భూములు ఆక్రమణకు గురి కాకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి పోడు భూముల పట్టాలు అందించి హక్కు కల్పించేందుకు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. వాస్తవంగా పోడు భూములు చేసుకున్న వారికి అన్యాయం జరగకుండా చూడాలని, ఇప్పటివరకు పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటున్న వారికి న్యాయం చేస్తూనే ఇక మీదట అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా అరికట్టేందుకు అటవీ రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.అటవీ భూముల సమస్యలను పరిష్కరించుటకు సులభతరమైన ప్రత్యేకంగా యాప్ ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందిచింది అని కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శాయంపేట మండలం లో 5 గ్రామ పంచాయతీ లలో కాట్రపల్లి, గంగిరేణి గూడెం, సాధన పల్లి, నూర్జహాన్ పల్లి, సూర్య నాయక్ తండాలను అవాసీత ప్రాంతాలను గుర్తించి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. ఈ అవాసీత ప్రాంతాలలో 777 క్లెయిమ్స్ ఆన్లైన్ లో వచ్చాయని అన్నారు. పోడు చేసుకున్న సమగ్రవివరాలు,భూములకొలతల వివరాలు ఏటువంటి పొరపాటులకు తావు లేకుండా క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
ఈ యాప్ హ్యాబిటేషన్ వారీగా డేటా, ఫారెస్ట్ డేటా ఒకే విధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అన్నారు. యాప్ లో నిర్దేశించిన సమయం లోగా నమోదు చేయాలి అని అన్నారు.
ఈ యాప్ వినియోగం పై పవర్ ప్రజెంటేషన్ ద్వారా పంచాయతీ సెక్రటరీలకు అవగాహన ను అధికారులు కల్పించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యా రాణీ, డిఆర్ఓ వాసు చంద్ర, ఎడి సర్వే ల్యాండ్, ప్రభాకర్, డిపిఓ జగదీశ్, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రమీల, ఎఫ్ఆర్ఓ లు, సదనందం, బిక్షపతి, రెవెన్యూ, ఫారెస్ట్, సర్వే ల్యాండ్, పంచాయితీ రాజ్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.