పోరుబాట బహిరంగసభ విజయవంతం చేయాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి రాంగోపాల్ రెడ్డి
కరీంనగర్, నవంబర్ 30 (జనంసాక్షి) సామాజిక తెలంగాణా- సమగ్రాభివృద్ది ద్యేయంగా అక్టోబర్ 6న జనగామలో ప్రారంభమైన సిపిఐ పోరుబాట కార్యక్రమం ఈనెల 3 వతేదీన కరీంనగర్ చేరుకుంటుందని,.
ఈబహిరంగ సభను విజయవంతం చేయాలని ఇందులో యువత కీలక పాత్ర పోషించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు గురువారం ఎఐవైఎఫ్, ఎఐఎస్‌ఎఫ్ ఆద్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలో జరిగిన జిల్లా జనసేవాదల్ శిక్షణ శిభిరాన్ని ప్రారంభించారు. ఈసందర్బంగా రాంగోపాల్ మాట్లాడుతూ కేసీఆర్ మూడున్నరేల్ల పాలనలో అగ్రవర్ణాలకు తప్ప జనాబాలో మెజార్టిగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒరగబెట్టింది ఏమిలేదన్నారు. ప్రజాదనాన్ని దేవుల్ల పేరుతో, విదేశీయాత్రలతో దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. అగ్రరాజ్యాల మెప్పుకోసం తపిస్తున్నారని మండిపడ్డారు. సబ్సీడి గొర్రెలు, ముదిరాజ్‌లకు చేపపిల్లలు, నాయీ బ్రాహ్మణులకు సెలూన్‌ల పేరుతో కులాలను విభజించి పాలించేందుకు కుట్ర పన్ని కాలం వెల్లదీస్తున్నాడని కేసీఆర్‌పై మండిపడ్డారు. పోరుబాటీతో కల్లు తెరిచిన కేసీఆర్ బీసి మంత్రుల, ఎమ్మెల్యేల సమావేశాన్ని నిర్వహిస్తున్నాడని వెల్లడించారు. ముగింపు సందర్బంగా 3 వతేదీన కరీంనగర్ సర్కస్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు స్వచ్చందంగా ప్రజలు తరలిరావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎఐవైఎఫ్ జిల్లా అద్యక్షుడు పైడిల్లి శ్రీనివాస్, కార్యదర్శి ముల్కల మల్లేశం, జనసేవాదల్ రాష్ట్ర ఇన్‌స్టక్ట్రర్‌తోట విజయ్, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా అద్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, రైతు సంఘం జిల్లాకార్యదర్శి పొనగంటి కేదారి తదితరులు పాల్గొన్నారు.



