పోలవరం బంగారం.. ‘లెండి’ వెండి !
‘లెండి’ ప్రాజెక్టు పైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదే శ్ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుని 36 ఏళ్ల పుణ్యకాలం గడిచింది.6-10-75 నాడు చేసుకు న్న ఒప్పందంలో లోయర్ పెన్‌గంగ, ప్రాణహితల తోపాటు ‘లెండి’ని కూడా ఉభయ ప్రభుత్వాలు ఉమ్మడి ప్రాజెక్టులుగా చేపట్టాలని నిర్ణయించాయి. కానీ ఏం లాభం ? ఇంత వరకు ఏ ప్రాజెక్టు కార్య రూపం దాల్చలేదు. పాణహిత పూర్తిగా గాయబ్ అయింది. ప్రాణహిత-చేవెళ్ల వస్తోంది కదా, ఇం కా ప్రాణహిత అవసరం లేదు. అన్న కారణం కావొచ్చు.కానీ ఆ విషయమైనా స్పష్టం చేయాలి కదా! ఇంతవరకు ప్రభుత్వం వివరణ ఇచ్చిన ట్టులేదు. ఇక లోయర్ సెన్‌గంగ ణూ= (సవివ రమైన ప్రాజెక్టు వేదిక)తయారీ స్టేజీలోనే ఉన్నది. ఆ రెండు ప్రాజెక్టులతో పోతిస్తే నిజామాబాద్ జి ల్లాలోని బిచ్‌కుంద, మద్దూరు మండలాల్లోని 22 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే ఉద్దేశంతో తలపెట్టిన ‘లెండి’ ప్రాజెక్టు చాలా ముందుంది. అని చెప్పొచ్చు. లెండి చేసుకున్న సుకృతమేమంటే ప్రభుత్వం సాగునీటికి సంబం ధించిన ఏ డాక్యుమెంట్ తయారు చేసినా అందు లో తప్పనిసరిగా లెండి ప్రస్తావన ఉండి తీరుతుం ది. 13-4-93 నాడు కేంద్ర జల సంఘం మహా రాష్ట్రలోని ‘లెండి’ డ్యాం సైట్ దగ్గర మహారా ష్ట్ర,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేసింది. అందులో కొన్ని సాంకేతిక,ఆర్ధిక పరమైన విషయాల పైన రెండు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నట్టు ఆంధ్రప్రదే శ్, ప్రభుత్వం వారి సాగునీటి అంశాలపై రిపోర్టు (1995-1996) స్పష్టం చేసింది.
ఆ నిర్ణయాలు చేసిన అంశాలు ఇవి:
1. ఆంధ్రప్రదేశ్ వాటా ఖర్చు అంచనా
2. సాగుచేసే క్షేతం అంచనా
3. పంట వివరాలు,వాటికి నెలవారీగా అవసరమయ్యే నీటి వివరాలు
4. కాలువ సామర్థ్యం వగైరా వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాలనుకనుగు ణంగా 19-4-93 నాడే మహారాష్ట్ర ప్రభుత్వాని కి ఈ వివరాలన్నీ అందచేసినట్టుగా తెలియ చేయడం జరిగింది. 21–93 నాడు ఔరంగా బాద్‌లో ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో మరో సమా వేశం జరిగి సాంకేతిక ఆర్థిక అంశాలపై మరింత స్పష్టత వచ్చినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ఫ్రభూత్వం వారి నివేదిక అనుసరించి కేంద్రజల సంఘం అనుమతి ఇంకా రావలసి ఉందని ప్రాజ ెక్ట్ ఖర్చులో ఎవంత భరించాలీ అన్న విషయంపై మహారాష్ట్రలో ఇంకా అవగాహన పూర్తికాలేదని తెలిసింది. ఏదేమైనా 95-96 నాటికి లెండి ప్రాజెక్టుపై చర్చలు ఇంకా జరుగుతున్నట్లు భావిం చవలసి ఉంటుంది. అంటే 20 సంవత్సరాలు గడిచిన చర్చలు ఓ కొలిక్కి రాలేదని అర్థం చేసుకోవలసి ఉంటుంది.
20-6-1999 నాడు రాష్ట్ర ప్రభుత్వం తయా రు చేసిన గోదావరి జలాల వినియోగ ప్రణాళి కలో ఈ ప్రాజెక్టు ద్వారా 2. టీఎంసీల గోదావరి జలాల వినియోగంతో 22 వేల ఎకరాలు సాగు లోకి వస్తాయి. ఈ ప్రాజెక్టును ఉమ్మడి ప్రాజెక్టుగా నిర్మించడానికి తన సంసిద్ధతని తెలియచేసింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుగా నిర్మించడానికి తన సంసిద్ధతని తెలియ చేసింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వంతో ఈ మేరకు అంతరాష్ట్ర ఒప్పంద పత్రాన్ని ఖరారు చేయవలసి ఉంది. అని రాసుంది. ఇక శాసనసభలో ప్రవేశపెట్టిన 2005-2006 సంవత్సరపు భారీ మరియు మధ్యతరహా సాగునీటి డింమాడ్ (నెంబర్ శశశIII)పై వివరణ డాక్యుమెంట్‌లో నాటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఏమన్నారంటే ‘లెండి’ ప్రాజెక్టు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఏర్పాటు చేయబడిన ఉమ్మడి ప్రాజెక్టు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముఖేడ్ తూలూకా, గోనెగావ్ గ్రామం దగ్గర లెండి నదిపై ఈ రిజర్వాయర్‌ను ప్రతిపాదించమయింది. ప్రతిపాది త స్థలంలో నీటి లభ్యత 7.423 టీఎంసీలు అందులో ఆంధ్రప్రదే శ్ వాటా ప్రవాహ నష్టాలతో కలిసి 2.3 టీఎంసీలు, మహారాష్ట్రలోని ఎడమగ ట్టు కాలువ 20.46 కిమీ వద్ద ప్రారంభమయ్యే 34.57 కిమీల పొడవు గల కుడి గట్టు కాలువ ఆంధ్రప్రదేశ్‌లో 22 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికిత ప్రతిపా దించిడమయినది. మొత్తం మీద నిజామాబాద్ జి ల్లా మద్దూరు, బిచ్‌కుంద మండలాలలోని 31 గ్రా మాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రాజె క్టు మొత్తం విలువ రూ. 275 కోట్లకు గాను, ఆం ధ్రప్రదేశ్ వాటా రూ.117.7 కోట్లు (ఎస్‌ఎస్‌ఆర్ 2000-2001).
లెండి నది వద్ద డ్యాం పని కొనసాగుతున్నది. నిర్వాసితులకు చెల్లింపులు చేయవలసి ఉంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో కాలువ సర్వే పనులు జరుగుతున్నాయి.ఆంధ్రప్రదేశ్‌లో లెండి నదిపై ప్రధాన నిర్మాణ పనిని అతిత్వరలో ప్రారంభించ డం జరుగుతుంది. నీటిని పంచుకోవడంతో సహా అంతర్ రాష్ట్ర అంశాలపై స్థూల ఏకాభిప్రాయం కుదిరింది. లెండి ప్రాజెక్టు అమలు, నిర్వహణ కో సం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య అంతర్‌రాష్ట్ర ఒప్పందాన్ని 1-11-2003 తేదిన కుదుర్చుకోవడం జరిగింది. ఇప్పటికీ అమలు చేసిన పనుల కోసం తన వాటాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.12.9 కోట్ల మొత్తాన్ని విడుదల చేసింది. 2005-2006 బడ్జెట్ అంచనాలలో రూ.15 కోట్ల మొత్తాన్ని సమకూర్చడమయింది. అంటే 30 సంవత్సరాల తర్వాత లెండి ప్రాజెక్టు పురోగతి పైన చెప్పిన విధంగా ఉంది. మరో ఆరు సంవత్సరాల తర్వాత లెండి గురించి ప్రభుత్వం ఏం చెప్పిందో గమనిద్దాం.
24-12-2012 నాటి ప్రభుత్వం నివేదిక లెండి ప్రాజెక్టుపైన తాజా సమాచారాన్ని తెలియ జేప్పింది. దానిలోని ప్రధానమైన అంగాలు ఇవి. లెండి డ్యాం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముఖే డ్ తాలూకా గోనెగావ్ వద్ద ఉన్నది. ప్రాజెక్టు ద్వా రా మొత్తం 49 వేల ఎకరాలకు సాగునీరందు తుంది. అందులో మన వాటా 22 వేల ఎకరా లు.ప్రాజెక్టు దగ్గర లభించే నీరు 6.36 టీఎంసీలు (ముందు చెప్పినట్లుగా 7.423 టీఎంసీలు భిన్నంగా) అందులో ఆంధ్రప్రదేశ్ 2.43 టీఎంసీ లు, మహారాష్ట్ర 3.93 టీఎంసీలు వాడుకుంటా యి. ప్రాజెక్టు ఖర్చు 1-11-2003 నాటి అంత ర్రాష్ట్ర ఒప్పందం అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన రెండో సవరించిన పరిపాల క ఆమోదం ప్రకారం (జీవో 369, తేదీ : 16-06-2010) ప్రాజెక్టు విలువ 263.9 కోట్ల రూపాయలు. ఇందులో డ్యాంహెడ్‌వర్‌క్స్కకు గా ను 117.22 కోట్లు (39 శాతం మన వాటా) 19 కిలోమీటర్ల ఉమ్మడి కాలువకు గాను మన వాటా 2.66 కోట్లు. మహారాష్ట్రలో మన కోసం తవ్వే కాలువ 7.5 కి.మీ.పై ఖర్చు 44.47కోట్లు. వెరసి 190.35కోట్ల రూపాయలను మనం మహారాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది.నవంబర్ 2011 వరకు 152.23 కోట్ల రూపాయలను మహారాష్ట్రకు చెల్లించడం జరిగింది. ఇంకా మహారాష్ట్ర భూ భాగంలో 1.93 కి.మీ. కాలువ తవ్వకం పనులు మిగిలి ఉన్నాయి. దాన్ని పై ఖర్చు ఖరారు అయిన పిమ్మట మనం భరించవలసి ఉంటుంది. ఇక మన భూ భాగం విషయానికి వస్తే 9.43 కి.మీ. నుంచి 34.57 కి.మీ. వరకు అంటే.. 25.14 కి.మీ. ప్రధాన కాలువ, ఉప కాలువలు వగైరా పనులకు 45.75 కోట్ల రూపాయల ఖర్చవుతుందని అంచనా వేయడం జరిగింది. ఇందులో నవంబర్ 11నాటికి 12.491 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. ఈప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి ప్రధానమైన అడ్డంకి భూసేకరణ అని ప్రభుత్వం చెబుతున్నది. మొత్తం కాలువల కోసం 1075 ఎకరాల భూసేకరణ జరగవలసి ఉండగా నవంబర్ 2011 నాటికి 410 ఎకరాలు సేకరించినట్లు పధాన కాలువలకు దాదాపు పూర్తి భూసేకరణ జరిగింది.),మిగిలిన భూసేకరణ కోసం ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు తెలియవచ్చింది.
మహారాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు 75 శాతం పనులు పూర్తి చేసింది. మన భూభాగంలో కాలువ, పంపీణీ వ్యవస్థ, కాలువలపై నిర్మాణాలు, భూసేకరణ కావొచ్చు, ఇతర కారణాలు కావచ్చు కేవలం 2 శాతం పనులు మాత్రమే పూర్తయినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 177.121 కోట్ల రూపాయలు ఖర్చయినా ప్రాజెక్టు పూర్తి కాలే దు. 2011-12 సంవత్సరానికి 60 కోట్ల రూపా యల బడ్జెట్ సమకూర్చినా 12 కోట్ల రూపాయలే ఖర్చు అయినట్లు తెలిసింది. ఇక్కడ గమనించా ల్సిందేమంటే కేవలం 2.3 టీఎంసీల నీటి విని యోగం,22 వేల ఎకరాలకు సాగునీటి సౌకర్యం. అదే వెనుకబడ్డి జిల్లాలోని రెండు మండలాల్లో 31 గ్రామాల ప్రజలకు ఉపయోగపడే స్కీంనొండి పూర్తి కావడానికి 36 సంవత్సరాలు గడిచినా ఇం కా ఒక కొలిక్కి రాకపోవడం.ఈ స్కీం గురించి ఇంతగా ఎందుకు ప్రస్తావించవలసి వస్తుందంటే ఇది గ్రావిటీ మార్గంగా (వాలుమార్గంగా ) అంటే డ్యాం, కాలువల ద్వారా నీరందించే పథకం. ఎత్తి పోతలు లేవు. ఖర్చు కూడా అట్టే లేదు. ఎందుకు ఆలస్యమవుతున్నది అనేది ఆందోళన కలిగించే అంశం. మన మేం చేస్తాం మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదనో, కేంద్ర జలసంఘం అనుమ తులు ఇవ్వలేదనో తేలిగ్గా చెప్పితప్పుకోవచ్చు. కా నీ మన ప్రభుత్వం చిత్త శుద్ధిగా ఈ ప్రాజెక్టు సాకా రం కోసం ప్రయత్నాలు చేసిందా అన్నది అనుమా నమే. ఇకపోతే భూసేకరణ సమస్య.ఇందులో నూ టికి నూరు శాతం ప్రభుత్వానిదే తప్పు. మార్కెట్ రేటు కాకుండా ఏదో ఓ రేటు నిర్ణయించి ఆ రేటు కే పైతులు తమ భూముల్ని ప్రభుత్వ ప్రయో జనాలకు అంతా పక్షపాత పక్షపాత ధోరణిలో ఈ భూసేకరణ కార్యక్షికమం కొనసాగడం మనం చూశాం. రైతులకు నాయమైన రేటు ఇస్తే భూము ల్ని వదులుకోవడానికి ప్రజా ప్రయోజనాల కోసం వెనుకాడరు.శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వితీయ దశ పనులు ఖమ్మం ఏరియాలో సరియైన రేట్లు చెల్లిం చని కారణంగా భూసేకరణ పనులు ఏళ్లకొద్దీ ఆగి పోవడం అందరికీ తెలుసు. బహుశా లెండి పను లు కుడా ఈ కారణంగానే ఆలస్యమవుతున్నట్లుగా భావించవలసి వస్తుంది. ఏదేమైనా శాశ్వతంగా త మ జీవనోపాధిని కోల్పొయే రైతుల పట్ల ప్రభు త్వం మరింత ఉదారంగా మానవీయ కోణంలో ప్రవర్తించవలసిన అవసరం ఉన్నది. ఇటు లెండి ప్రాజెక్టు కానివ్వండి, అటు లోయర్ పెన్‌గంగ కా నివ్వండి రెండూ చాలా చిన్న పథకాలే. రెండూ మహారాష్ట్ర సహకారంతో సాకారం కావలసినవే.
కానీ ఇవి రెండూ గ్రావిటీ పథకాలు. ఎలాం టి విద్యుత్ అవసరాలతో నిమిత్తం లేకుండా ప్రవా హ మార్గంగా తెలంగాణలోని వెనుకబడ్డ ఆదిలా బాద్, నిజామాబాద్ జిల్లాల ప్రజల అవసరాలను పాక్షికంగా తీర్చేవే! కనుక ప్రభుత్వం తన వివక్ష విడనాడి మరింత చిత్తశుద్ధితో మహారాష్ట్ర ప్రభు త్వాన్ని ఒప్పించి సత్వర చర్యలు చేపాట్టాలి. అదే విధంగా రైతుల పట్ల మరింత ఔధార్యం ప్రదర్శిం చి భూసేకరణ పనులను వేగవంతం చేయాల్సిన అవసరం కూడా ఉంది.
అసలు విషయం ఏమిటంటే.. లెండి పూర్తి కాకపోయినా, పెన్‌గంగ పూర్తి కాకపోయినా వల స పాలకులకు పోయేదేమీ లేదు. ఆ నీళ్లు కాస్త కిందకు పారతాయి.సర్‌ఆర్థర్ కాటన్ ఆనకట్టకు ఎన్ని పోచికోలు కబుర్లు చెప్పి నా వలస పాలకుల కు తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి కావాలన్న ఆదు ర్ధా, తపన ఎందుకుంటుంది? తెలంగాణ వాడు కాకపోతే ఆ నీళ్లన్నీ ఆంధ్రకే, కృష్ణా అయినా, గోదావరి అయినా ఇదే కథ. ఏదో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామన్న పేరు తప్ప సీమాంధ్ర ప్రాజె క్టుల పట్ల ఉన్న శ్రద్ధ చస్తే తెలంగాణ ప్రాజెక్టుల పట్ల ఉండదు. పోలవరంపై ఉన్న ప్రేమ ప్రాణహి తపైన గానీ, లెండి పైన గానీ ఉండదు. పోలవ రం బంగారం అయితే లెండి వెండి. కనుక పరి ష్కారం ఒక్కటే. ప్రత్యేక రాష్ట్రం.