పోలీసు కాల్పులపై
31న మెజిస్టిరియల్ విచారణ
శ్రీకాకుళం, జూలై 29 : కాసరపల్లి థర్మల్ ఉద్యమంలో భాగంగా 2011, ఫిబ్రవరి 28న పోతినాయుడు పేట కూడలిలో జరిగిన పోలీసు కాల్పులకు సంబంధించి ఈ నెల 31న సంతబొమ్మాళి తహసీల్దారు కార్యాలయంలో విచారణ నిర్వహించనున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పి.భాస్కర్ ఆధ్వర్యంలో ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరగనున్నదని, ప్రజలు తమ వాంగ్మూలాలను చెప్పవచ్చని సంతబొమ్మాళి మండలం తహసీల్దారు శ్రీనివాసరావు తెలిపారు.