*పోలీస్‌ వ్యవస్థ పనితీరు సేవలపై విద్యార్థులకు అవగాహన..*

-ఎస్సై ఎం.రమేష్ నాయక్*
 
దేవరుప్పుల, అక్టోబర్ 23(జనం సాక్షి):
ప్రజా రక్షణే పోలీస్ ప్రధాన లక్ష్యమని దేవరుప్పుల ఎస్సై ఎం. రమేష్ నాయక్ పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా శనివారం దేవరుప్పుల మండల కేంద్రంలో ఉన్న శ్రీ సాయి ప్రశాంతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసమే పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని..
పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలు స్టేషన్‌ అధికారి రైటర్‌ వైర్‌ లెస్‌ కేసుల నమోదు క్రైమ్ ఫైల్స్ ట్రాఫిక్‌ నియంత్రణ షీ-టీమ్‌ బృందాల సేవలు శాంతిభద్రతల పరిరక్షించడంలో పోలీసుల పాత్ర చట్టాలపై అవగాహన ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నేరుగా పొలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని..లేకుంటే 100 నంబర్‌కు ఫోన్‌ చేస్తే పోలీస్ సిబ్బంది మీ వద్దకు వచ్చి సమస్యను పరిష్కరిస్తారని..చట్టాలపై అవగాహన ఆయుధాల వినియోగాన్ని గూర్చి ఎఫ్‌ఐఆర్‌ నమోదు కానిస్టేబుల్‌ హెడ్‌ కానిస్టేబుల్‌  ఏఎస్సై ఎస్సై సీఐ డీఎస్పీ అడిషనల్‌ఎస్పీ ఎస్పీ డీజీపీ వరకు పోలీస్‌ శాఖకు సంబంధించి కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు ఉన్న హోదాలకు విద్యార్థులకు వివరించారు.