పోలీస్ అమరవీరుల దినోత్సవ వారోత్సవాలలో భాగంగా రక్తదాన శిబిరం

కొండమల్లేపల్లి  అక్టోబర్ 23 జనం సాక్షి:
దేవరకొండ డివిజన్ పోలీస్ శాఖ మరియు దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగినది ,ఈ యొక్క కార్యక్రమానికి గౌరవనీయులు DSP నాగేశ్వరావు గారు, అధ్యక్షుడు NVT, పోలీస్ శాఖ సిబ్బంది ,స్పోర్ట్స్ అసోసియేషన్  సభ్యులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు, అనంతరం వారు మాట్లాడుతూ అమరవీరుల దినోత్సవం సందర్భంగా, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎంతోమంది పోలీసుల, వారి సేవలు చిరస్మరణీయమని, కోవిడ్ టైంలో వారు చేసిన సేవలు మరువలేనివని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని అలాంటి వారిని స్మరించుకొని ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినదని, దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ డాక్టర్ రాములు నాయక్, CI శ్రీనివాస్ గారు,NVT, సీఐ పరశురాం గారు, SI లు, బాలకృష్ణ, యాదయ్య,  రాజు ,నారాయణరెడ్డి ,సతీష్, నందులాల్ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు అమర్ ,ఉమా మహేష్ ,తాళ్ల సురేష్, తాళ్ల శ్రీధర్ గౌడ్, బాబా, జయరాం ,సలీం ,నరేష్, సందీప్, గోపాల్, రాము, సాయి, సన్నీ, చారి, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు, చంద్రన్న పౌండేషన్ సభ్యులు, పోలీస్ శాఖ సిబ్బంది మెడికల్ సిబ్బంది క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ ఒక్క రక్తదాన శిబిరంలో 42 మంది రక్తదానం చేయడం జరిగినది