*ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా సమాచార హక్కు చట్టం*

కోదాడ అక్టోబర్ 12(జనం సాక్షి)
 ప్రభుత్వ అధికారుల్లో జవాబుదారితనం పెరిగిందని కోదాడ డిఎస్పి వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు బుధవారం కోదాడ పట్టణంలోని తన కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కేంద్ర ప్రభుత్వం రూపొందించి అమలులోకి వచ్చి నేటికి 18 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా కోదాడ నియోజకవర్గ సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా ప్రతి పౌరుడు ఏ శాఖలో నైనా సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. చట్టాన్ని అడ్డం పెట్టుకొని బెదిరింపు ధోరణులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమాచార హక్కు చట్టం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటుందన్నారు. సమాచార హక్కు వికాస సమితి సభ్యులు సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ తో పాటు సిఐ పట్టణ ఎస్ఐలను  శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలోనియోజకవర్గ అధ్యక్షులు పగిడిపల్లి ఏసు పాదం, కోదాడ టౌన్ అధ్యక్షులుగంధం పాండు, జిల్లా ప్రచార కార్యదర్శికాసర్ల రాజశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులుఎస్.కె అహ్మద్, పాత కోటి రామారావు, ఎస్ కే బాజీ, ఎస్.కె రషీద్, కర్ల కాంతారావు, మాతంగి శ్రీనివాస్, ఎస్కే బాలే సాబ్, వేనేపల్లి యాదగిరి రావు, కాంపాటి రామకృష్ణ, గడ్డం ఏసు, సోమపొంగు రవికుమార్, మద్దెల రవికుమార్, ఎండి హైమద్తదితరులు పాల్గొన్నారు.