ప్రజల ఆకాంక్షలకు విరుద్దంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

ఏఐసీసీ నేత శ్రీనివాసన్‌

కరీంనగర్‌,జూలై10(జ‌నం సాక్షి ): దేశవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి నెలకొందని ఏఐసీసీ నేత శ్రీనివాసన్‌ కృష్ణన్‌ అన్నారు.అలాగే ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. కరీంననగరంలో కాంగ్రెస్‌ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఏఐసీసీ నేత శ్రీనివాసన్‌, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం, తదితర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసన్‌ కృష్ణన్‌ మాట్లాడుతూ కేంద్రం ఆర్థిక, సామాజిక, విదేశీవ్యవహారాల్లో విఫలమైందని ఆరోపించారు. తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో కూల్చాలని శ్రీనివాసన్‌ కృష్ణన్‌ పిలుపు నిచ్చారు. మరో నేత జీవన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను కేసీఆర్‌ అప్పుల రాష్ట్రంగా మార్చారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హావిూని కేసీఆర్‌ నెరవేర్చలేదని తెలిపారు. కాంగ్రెస్‌ కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని జీవన్‌రెడ్డి కోరారు. మరోనేత పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ హావిూల అమలులో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ఇచ్చిన హావిూలపై గ్రామస్థాయిలో చర్చలు జరపాలన్నారు. సోనియా గురించి కేటీఆర్‌ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. కేటీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. టీఆర్‌ఎస్‌ను గ్దదె దించడమే మా లక్ష్యమని పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు.

——-