ప్రజల కష్టాలు తీర్చడమే మొదటి ప్రాధాన్యం
జహీరాబాద్. ఆగస్టు 16 (జనంసాక్షి ) నియోజకవర్గ పరిధిలోని కోహిర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని శేక్ వాడలో మురికి కాలువ మీద నుంచి ప్రజలకు రకపోకల్లో అవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కల్వర్టు సమస్యను గుర్తించిన ఎంపిటిసి. అబేదా తలత్ సమస్య పరిష్కారానికి తక్షణమే రంగంలోకి దిగి తన సొంత నిధులతో కల్వర్టు బ్రిడ్జి నిర్మించి ప్రజల, వాహనదారుల కష్టన్ని తీర్చారు, ఈ సందర్భంగా ఎంపిటిసి ప్రతినిది సవుద్ షాహిద్, పట్టణ తెరాస అధ్యక్షుడు ఇఫ్తేఖర్ అహేమద్ మాట్లాడుతూ కోహిర్ మేజర్ గ్రామ పంచాయతీలోని శేక్ వాడాలో ప్రజలకు రాకపోకల దృష్ట్య గుర్తించిన ఎంపిటిసి. అబేదా తలత్ తమ సొంత నిధులతో కల్వర్టు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజల కష్టలను తొలగించారని, రాబోయే రోజుల్లో జహీరాబాద్ ఎమ్మెల్యే మణిక్ రావు, పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్, రాష్ట్ర ఆర్ధిక మంత్రి తన్నీరు హరీష్ రావు సహకారంతో మరిన్ని నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు…