ప్రజాప్రతినిధుల సహకారంతో అప్రమత్తం

ఎంపీడీవో తాళ్లూరి రవి

, జులై 13, జనంసాక్షి: ఉపరితల ద్రోణి, రుతుపవనాల ప్రభావంతో గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలకు సమస్యలు తలెత్తకుండా స్తానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుస్తు చర్యలకు సిద్దంగా ఉన్నట్లు ఎంపీడీవో తాళ్లూరి రవి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మండలంలో ప్రధానమైన వాగులు, చెరువులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. వాగులు, చెరువుల్లోకి వరద ప్రవాహం ఎక్కువ అయిన సమయంలో సమీప గ్రామాల ప్రజలకు కొంత ఇబ్బందికరంగా మారుతుందని అన్నారు. రోడ్లు, లో లెవెల్ చప్టాలపై నుంచి వరద ప్రవాహించే అవకాశం ఉంది. రోడ్లపై రాకపోకలు సాగించే సమయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు తమ వంతు కనీ‌స బాధ్యతగా వాగులు, కుంటలు, చెరువుల వద్దకు ప్రజలు వెళ్లవద్దని గ్రామాల్లో ప్రచారం జరిగే విధంగా చూడాలని కోరారు. మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడిస్తున్న నేపధ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రధానంగా వర్షాకాలంలో కరెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, కరెంటుకు సంబంధించిన వస్తువులకు దూరంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకునేందుకు ప్రజాప్రతినిధుల సహకారంతో యంత్రాంగం అప్రమత్తంగా ఉందని తెలిపారు.