ప్రజావాణితో సమస్యలకు తక్షణ పరిష్కారం
ఆర్డీవో యం.హనుమంత రావు
జగిత్యాల, 18 జూన్ (జనంసాక్షి):
ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికై నిర్వహించబడుతున్న ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో ఆర్డీవో యం హనుమంతరావు ప్రజల నుండి ధరఖాస్తులను స్వీకరించారు. సోమ వారం రోజు 12 మంది తమ సమస్యల పరిష్కారానికై ధరఖాస్తుల ను ఇవ్వడం జరిగిందని , ఆ సమస్య లను వారంరోజుల్లో గానే పరిష్కరి స్తున్నామన్నారు.కోరుట్ల పట్టణానికి చెందిన యండీ. నజీరోధ్దీన్ సర్వే నంబరు478 లో ప్రభుత్వ స్థలం మంజూరీ చేసి ఇల్లు కట్టుకునుటకు ఇందిరమ్మ పథకం కింద రుణం ఇప్పించవలసిందిగా , రాయికల్ మండలం కిష్టంపేట్ కు చెందిన ఎను గంటి గంగ నర్సయ్య సర్వేనంబరు 191 లో ఉన్నటువంటి తన భూమికి కొలతలు చేయించ వలసిందిగా ఎన్నిమార్లు అభ్యర్థించినను చేయడం లేదని తగు చర్యలు గైకొనవలసిందిగా , పెగడపె ల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన కురి క్యాల ఉమారాణి లేబర్ కమీషనర్ ద్వారా తనకు రూ. 50వేలు మంజూరయినవని రూ. 30 వేలు మాత్రమే తనకు ఇచ్చినారని మిగితా డబ్బులు ఇవ్వడం లేదని ఇల్లు సగభాగం అయిందని మిగి తా డబ్బులు వస్త్తే ఇల్లు పూర్తవుతుందని తగుచ ర్యలు గైకొనవలసిందిగా కోరారు. జగిత్యాల మం డలం శంకులపల్లి గ్రామానికి చెందిన అనుమల్ల రాజేష్ సర్వే నంబరు 65 ఆ లో 2-26 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమి అని తెలువక కొనుగోలు చేయడం జరిగిందని ఇప్పటి తహసీల్ దార్ పట్టాదారు పాసుబుక్కు టైటిల్ డీడ్ కూడా ఇవ్వ డం జరిగిందని ప్రస్తుత తహసీల్ దార్ అట్టి భూమిని ప్రభుత్వ భూమి అని స్వాధీనం చేసుకు న్నదని దయతో అసైన్ట్మెంట్ పట్టా ఇపించ వలసిందిగా అభ్యర్థించారు. మల్లాపూర్ మండలం ఓబులాపూర్ కు చెందన కోట జలపతి సర్వే నం46 ఇ లో 2-22 ఎకరాల పట్టాభూమి గలద ని ఫోజిషన్‌లో 1-20 గుంటల భూమి మాత్రమే కలదని దయతో భూమికొలచి ఇప్పించగలరని , రాయికల్ కు చెందిన వాసం నర్సయ్యతన పొలం మద్యలో నుంచి ట్రాన్స్‌కో అధికారులు కరెంట్ పో ల్స్ వేసినారని దీంతో చాలా ఇబ్బందులు ఎదు రవుతున్నాయని వాటిని వెంటనే తీసివేయా లని అభ్యర్తించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీ షనర్ జేఆర్ సురేష్, ఆర్ డబ్యూఎస్.డి. రాజే శ్వర్ హౌజింగ్ డి.ఇఇ వాసం ప్రసాద్ , డివిజనల్ పంచాయితీ అధికారి గౌస్ మొహియొద్దీన్, డిఇ ఆర్‌అండ్‌బి మహేంధర్ సిడిపివో జగిత్యాల సు భద్ర, మల్యాల యం.కస్తూరి,మెప్మాపీఆర్‌పీ వి.సు నీతవివిధశాఖలఅధికారులుతదితరులున్నారు.