ప్రజావాణి కి 40 ఫిర్యాదులు..

కామారెడ్డి ప్రతినిధి ఆగస్ట్8 (జనంసాక్షి);
ప్రజావాణి కి 40 ఫిర్యాదులు వచ్చినట్లు కామారెడ్డి కలెక్టర్ జితెష్ వి పాటిల్ తెలిపారు.
రెవెన్యూ22,డియం అండ్ యచ్ఓ2,
 డిపిఓ6, మున్సిపల్3,యస్సీ డెవలప్‌మెంట్1,పొలిస్2,
సర్వే అండ్  ల్యాండ్ రికార్డు3, చీప్ ఎక్స్ క్యు టివ్ అపిసర్ జడ్పి నిజామాబాద్, కామారెడ్డి1, శాఖలపై పలు పిర్యాదు లు వచ్చాయని తెలిపారు.ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని  జిల్లా  కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి ఈ సందర్భంగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులకు పంపి పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని శాఖల అధికారులు అభివృద్ధి పనులపై నివేదికలను సిపిఓ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, డి ఆర్ డి ఓ సాయన్న, జడ్పీ సీఈవో సాయాగౌడ్,జిల్లా అధికారులు పాల్గొన్నారు.