ప్రణాళిలను తయారు చేయాలి
గుంటూరు, జూలై 20: జిల్లాలో రైతుల అవసరాల అనుగుణంగా వ్యవసాయ, ఉద్యావన శాఖల ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ సురేష్కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వ్యవసాయ, ఉద్యావన శాఖలు కార్యక్రమాన్ని అమలు చేస్తున్న పని తీరుపై శుక్రవారం అధికారులతో సమీక్షించారు. ఖరీఫ్ సీజన్ రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు సక్రమైనరీతిలో సరఫరా చేయాలని అన్నారు. అక్రమ తరలింపును, నకలి విత్తనాలు ఎరువు అమ్మకాలను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఉద్యానవన పంటల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి అధికారులు చోరవ చూపాలన్నారు. సమస్యలను తనదృష్టికి తేవాలన్నారు.