చేవెళ్ల ఎస్టి డిక్ల రేషన్ తక్షణమే అమలు చేయాలని


డి ఎస్ ఎఫ్ ఐ
జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ డిమాండ్,

మరిపెడ మార్చి 6 (జనంసాక్షి)చేవెళ్ల ఎస్టి డిక్ల రేషన్ తక్షణమే అమలు చేయాలని, గిరిజనులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని,డి ఎస్ ఎఫ్ ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మరిపెడ మండల కేంద్రంలో ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షుడు భూక్యా. రామ్మూర్తి నాయక్ అధ్యక్షతన ఎల్ హెచ్ పి ఎస్ మహబూబాబాద్ జిల్లా విస్తృతస్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.లంబాడీలకుమంత్రిపదవిఇవ్వకుండా రేవంత్ రెడ్డిప్రభుత్వం లంబాడీలను మోసం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమావేశానికి 18 మండలాల నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావడం సంతోషం అన్నారు. మానుకోట గడ్డ అనేదిఉద్యమాలకు పుట్టినిల్లుఅని,“మానుకోట గడ్డ ఉద్యమ గడ్డ” అని పేర్కొన్నారు. గిరిజన సమాజ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని, గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన సమాజానికి న్యాయం జరగాలంటే చేవెళ్ల ఎస్టీ డిక్లరేషన్‌ను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి లంబాడీ సమాజం కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. లంబాడీ సమాజానికిగౌరవప్రదంగా మంత్రివర్గంలో ఒక మంత్రి పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లంబాడీ సమాజ అభివృద్ధి, హక్కుల సాధన కోసం పలు కీలక తీర్మానాలు ఈ సమావేశంలో ఆమోదిస్తున్న మన్నారు. సమాజ హక్కుల కోసం భవిష్యత్తులో బలమైన పోరాటంకొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు. భీమానాయక్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్. చందూలాల్ , కార్మిక విభాగం మంగిలాల్ ,రాందాస్ ,మండల నాయకులు లూనావత్. జగన్, జరుపుల. వెంకన్న, భూక్యా. సుధాకర్, బోడ. రమేష్, మోహన్,శ్రీను ,చంద్రశేఖర్,అజయ్, పుల్ సింగ్, డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కెలోత్. సాయి కుమార్, రాష్ట్ర కోశాధికారి గూగులోతు. సూర్య ప్రకాష్,భూక్యా. శ్రీకాంత్,రమేష్,శివ వర్మ,దేవేందర్, తదితరులుపాల్గొన్నారు