ఆత్మ వరంగల్ జిల్లా డైరెక్టర్ గా గుర్రం అచ్చయ్య

చెన్నారావుపేట, మార్చి 6 ( జనం సాక్షి): ఆత్మ జిల్లా డైరెక్టర్ గా గురిజాల గ్రామానికి చెందిన బ్లాక్ కాంగ్రెస్ నాయకులు గుర్రం అచ్చయ్య నియమితులయ్యారు. శుక్రవారం ఆయన జిల్లా డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ పదవి రావడానికి సహకరించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ కు ఈ సందర్భంగా అచ్చయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.