ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని గర్భిణీలు, బాలింతలు, ఉపయోగించుకోవాలి
డీఎస్ఆర్ఆజెండాల్ తండ సర్పంచ్ గుగులోతు. రమేష్,
మరిపెడ మార్చి 6 (జనంసాక్షి)ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహరం లబ్ధిదారులందరికి అందేల అంగన్వాడీ కేంద్రాల నిర్వాహణ సక్రమంగా జరగాలని, అంగనవాడి కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని, డీఎస్ఆర్ జెండాల్ తండ సర్పంచ్ గుగులోతు. రమేష్ అన్నారు. శుక్రవారం మరిపెడ మండలం డీఎస్ఆర్ జెండాలతండ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆముదాలగడ్డతండ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన ఆరోగ్య లక్ష్మీ సమావేశానికి సర్పంచ్ హజరయ్యారు.కమిటీ ఆధ్వర్యంలో గర్భిణీలు,పాలిచ్చే తల్లులకు పోషకాహారం అయిన గండ్లు,పాలు, అన్నం,పప్పు సక్రమంగా అందుతుందో లేదో పరిశీలించారు.తల్లులకు ఆరోగ్య పరీక్షలు, ఐరన్ మాత్రలు,పిల్లల పెరుగుదలపై కమిటీ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.ప్రతీ నెల ఆరోగ్య లక్ష్మీ సమావేశం ఏర్పాటుకు సహకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ రమాదేవి,కార్యదర్శి కృష్ణ, పాఠశాల హెచ్ఎం సిద్దారెడ్డి,కమిటీ సభ్యులు మౌనిక,అంజలి,తల్లులు కవిత, కల్యాణి, తదితరులుపాల్గొన్నారు.



