ప్రతిభ చూపిన ఉషారాణి
ఖమ్మం, జూలై 12: ఖమ్మం పట్టణంలోని డిగ్రీ కళాశాలకు చెందిన అథ్లెటిక్ క్రీడాకారిణి ఉషారాణి ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ టోర్నమెంట్‌లో అండర్-18 విభాగంలో 800 మీటర్ల పరుగును 2.30 నిమిషాల్లో పూర్తి చేసి ప్రథమ స్థానంలో నిలిచారు. నాలుగువందల మీటర్ల పరుగుపందెంలోను ద్వితీయస్థానం మిడ్‌రిలేలో ద్వితీయస్థానాన్ని ఉషారాణి కైవసం చేసుకుంది. డిఆర్‌ఎస్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కరస్పాడెంట్ మోహన్‌రెడ్డి, అకడమిక్ డైరెక్టర్ డిఆర్ బోస్, ప్రిన్సిపాల్ అప్పారావు, వైస్ ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు ఉషారాణిని అభినందించారు.