ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి

బాన్సువాడ, ఆగస్టు 11 (జనం సాక్షి) : స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భారత్ స్వతంత్ర దినోత్సవ లో భాగంగా ప్రతి ఒక్కరు దేశభక్తిని చాటే అనేక కార్యక్రమాలు నిర్వహించాలని ఎంపిపి దొడ్ల నీరజ వెంకట్ రామ్ రెడ్డి అన్నారు. బాన్సువాడ మండలం బొర్లం గ్రామంలో గురువారం జాతీయ జెండాలను  ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాల సంధర్బంగా ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ చెయ్యడం జరుగుతుందని  అన్నారు. దేశంలోని కులమతాలకతీతంగా పేదధనిక తేడాలేకుండా దేశప్రజలు ఒకే రోజు జరుపుకునే గొప్పపండుగ జాతీయ జెండా పండుగ అని అన్నారు. ప్రభుత్వ కార్యాలయంలకే పరిమితమైన జాతీయ జెండా ఆవిష్కరణ నేడు ప్రతి ఇంటిపై భారతదేశ జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం కులమతాలకతీతంగా ఒకేరోజు అమరుల త్యాగాన్ని తలచుకుంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుకోవడం దేశ ప్రజలు చేసుకున్న అదృష్టం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరళ, మండల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మెన్. కె శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ మంద శ్రీనివాస్,మండల రైతుబంధు డైరెక్టర్ పి దేవేందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి. రాజేశ్వర్ గౌడ్, గ్రామ రైతుబంధు అధ్యక్షులు.నెర్రెనర్సింలు, మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు.సయ్యద్ జలీల్,ఆత్మ కమిటీ డైరెక్టర్.మన్నె చిన్న సాయిలు, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు.గోపన్ పల్లి సాయిలు, జి పి కార్యదర్శి. సాయికుమార్, వార్డు సభ్యులు. మన్నె నాగభూషణం,రవీందర్ రెడ్డి,  నాయకులు.పుట్టి లక్ష్మణ్,సయ్యద్ మెహరాజ్,బి మోహన్ రెడ్డి,సాద పవన్, పంచాయతి సిబ్బంది. సత్యనారాయణ, భాస్కర్, అంగన్వాడీ టీచర్స్ విజయ పద్మ పాల్గొన్నారు.