ప్రతి ఒక్కరు స్వచ్ఛ గ్రామంకొరకు కృషి చేయాలి
సదాశివనగర్ డిసెంబర్ 19 జనం సాక్షి: మండల కేంద్రంలో గురువారం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, గ్రామ నిధులు గురించి గ్రామస్తులకు తెలియజేశాడు, గ్రామ ప్రజలు మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఆరుబయట చెత్త వెయ్యకుండా అందరూ, చెత్త బుట్టలను వినయ్ వినియోగించాలని గ్రామ ప్రజలకు తెలియజేశాడు, పారిశుద్ధ్యం కోసం ట్రాక్టర్ ను కొనుగోలు చేశామన్నారు. నాటిన మొక్కలను రక్షించే బాధ్యత గ్రామ ప్రజలందరూ పైనే ఉందన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గాంధారి శ్రీనివాస్ రెడ్డి, ఎంపిటిసి పాపనొల్ల బీరయ్య, ఉప సర్పంచ్ రవి, వార్డ్ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.