ప్రతి రైతు పంట వివరాలు ఆన్లైన్ నమోదు చేసుకోవాలి

రామారెడ్డి    ఆగస్టు  19  జనంసాక్షీ  :
పంట వివరాలు ఆన్లైన్  నమోదు  చేసుకోవాలని ఏఈఓ రాఖేష్  అన్నారు.  ఈ సందర్భంగా  ఏఈఓ రాఖేష్ మాట్లాడుతూ,  రామారెడ్డి మండలం ఇసన్నపల్లి  గ్రామాంలో పంట వివరాలు ఆన్లైన్ నమోదు కార్యక్రమం చేపట్టామన్నారు.  పంటల సాగు దశలో ఉందన్నారు.   ఏ రైతు ఏఏ పంటలు సాగు చేస్తున్నారో ఆ వివరాలను క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ ఆద్వర్యంలో సేకరించే పనిలో ఉన్నామని అన్నారు.  ప్రతి రైతు తమ పంటల వివరాలు తెలుపాలని అన్నారు. వర్షాకాల పంటల సాగుపై జిల్లా  వ్యవసాయశాఖ ఆదేశాను సారం సర్వే  చేపట్టామని చెప్పారు . పంటల కోతల సమ యంలో రైతులు పంట ఉత్పత్తులను అమ్ముకు నేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు  పంట దిగు బడి ఎంతమేర వస్తుందనే అంచాన పై  పంటలసాగు వివరాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.  క్షేత్రస్థాయిలో  ఏవో, ఏఈవోలు,  పంటల నమోదు ప్రక్రియ చేపట్టి రైతుబంధు పోర్టల్‌లో నమోదు చేస్తున్నామని అన్నారు.  పంటల సాగు వివరాలు ఇవ్వని రైతులకు ఎస్ఎంఎస్‌ పంపి వివరాలు సేకరిస్తున్నా మని అన్నారు. ఈ కార్యక్ర మంలో ఏఓ హరీష్ కుమార్,   రైతులు పాల్గొన్నారు.