ప్రత్యామ్నాయ చరిత్ర నిర్మాణంలో విప్లవోద్యమం
తెలుగు సీమలో విప్లవ భావాల వ్రపేశం నాటి నుంచీ విప్లవవోద్యమం సంఘటిత నిర్మాణంగా ఎదిగి, ప్రత్యామ్నాయ అభివృద్ది నమూనాను అమలు చేసేదాకా సాగి వచ్చిన చరిత్రను వివరిస్తున్నారు వరవరరావు
విప్లవం అంటే సమాలమైన మార్పు. వర్గ సమాజంలో దోపిడీ వ్యవస్ధను కూల్చివేసి దాని స్ధానంలో శ్రామికశక్తుల అధికారాన్ని వెలకొల్పేది వప్లవం. అది వర్గ పోరాటం ద్వారా మాత్రమే సాధమయ్యే మార్పు. వర్గ సమాజంలో అధికారంలో ఉన్న ఏ పాలకులైనా తమ శాసనాలను, పరిపాలనను, దోపిడీని జైళ్లు, చట్టాలు, కోర్టులు, పోలీసులు, సైన్య బలగాల ద్వారానే అమలు చేస్తారు గనుక వారిని కూల్చివేయడానికి కూడా లేదా అధికారం నుంచి దించివేయడానికి కూడా సాయుధ పంథానే ఎంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉత్పత్తి శుక్తులను, సాధనాలను తమ గుప్పిట పెట్టుకొని అణచివేత, పీడనల ద్వారా ఉత్పత్తి ఫలితాలను దోచుకునే, కొల్లగొట్టే దోపిడీ వర్గాల విషయంలో, ఉత్పత్తిలో పోల్గొనే అశేష ప్రజానికానికి మరొక ప్రత్యామ్నాయం లేదు. కనుక వర్గ సమాజంలో వర్గ పోరాటపు ప్రధాన పోరాట రూపం సాయుధ పోరాటమే. ఇది స్పార్టకస్ కాలం నుంచి ఇవ్వాళ్టి దాకా చరిత్ర మళ్లీ మళ్లీ రుజువు చేసిన సత్యం. ప్యారిస్ కమ్యూన్ అయినా, బొల్షివిక్ విప్లవమైనా, చైనా విప్లవమైనా శ్రామిక వర్గం(కమ్యూనార్డులు), కార్మికులు, రైతాంగం ప్రధాన చదక శక్తిగా సాయుధంగా తిరుగబడిగానీ, దీర్ఘకాలిక పోరాటం ద్వారా కాని సాధించిన విజయాలే. ఈ యూడింటినీ కమ్యూనిస్టు విప్లవాలుగా పేర్కోనవచ్చు. వీటిలో ప్యారిస్ కమ్యూన్ ఒక్కటి మార్క్స్, ఎంజెల్స్ జీవితంలోనే జరిగి, ఆ ఇద్దరూ ప్రత్యక్షంగా పాల్గొన్నప్పటికి, అప్పటికింకా ఉక్కుశిక్షణ గల శ్రామికవర్గ పార్టీ నిర్మాణం జరిగి, దాని నాయకత్వంలో కాకుండా కమ్యూనార్హులు బూర్జువా వర్గంపై తిరుగుబాటు చేసారు. గనుక అది విజయవంతమైనా డెబ్జై రోజులు మాత్రమే అపూర్వంగా, ఉజ్వలంగా బతికి ఓడిపోయింది. జైళ్లు, పోలీసులు, దోపిడీలేని సంపూర్ణ మానవ వికాసం సాధ్యమయ్యే సమాజం ఎట్లా ఉంటుందో మాత్రం చవిచూసింది. మానవ జీవితంలోని బాల్యం వంటి ఆదిమ సమాజం నుంచి గతితార్కిక దృక్పథంతో మార్క్స్, ఎంజెల్స్ శాస్త్రీయంగా ఊహించిన చరిత్ర భౌతిక పరిణామం ఎలా ఉంటుందో రేఖా మాత్రంగా మన ముందు ప్యారిస్ కమ్యూన్ ఉంచింది. ప్యారిస్ కమ్యూన్ తిరుగుబాటుకు ఇంకా సర్వం సమాయత్తమైన సమయం రాలేదని మార్క్స్, ఎంగెల్స్ వారించినా కమ్యూనార్డులు ఫ్రెంచి బూర్జువా వర్గంతో యుద్దంలో తలపడడంతో మార్క్స్, ఎంగెల్స్ కూడా అందులో పాల్గొన్నారు.
ప్రవాహంలో పాల్గొనకుండా ప్రవాహ గతిని మార్యలేం.
ప్యారిస్ కమ్యూన్ నుండి పాఠం తీసుకున్న లెనిన్ జారిస్టు రష్యాలో బోల్షివిక్ పార్టీని నిర్మాణం చేసి కార్మికవర్గాన్ని సంఘటితం చేసి జారిస్టు రష్యా జాతుల బందీఖానాలో ఉన్న జాతులన్నింటినీ స్వఛ్చంద సంఘటనలోకి తెచ్చి 1917 ఫిబ్రవరిలో బూర్జువా విప్లవాన్ని అక్టోబర్‌లో సామ్యవాద విప్లవాన్ని సుసాధ్యం చేసారు. సెంట్ పీటర్స్‌బర్గ్ (లెనిన్ గ్రాడ్)లో ఏభై వేల మంది కార్మికులు సాధారణ సమ్మెకు పిలుపు ఇచ్చి జార్ చక్రవర్తి బలహీనమైన రాజ్యాన్ని కూల్చడానికి రంగంలో దూకారు. జార్ సైన్యంలోని గణనీయమైన సంఖ్య కూడా విప్లవ సైన్యంలో చేరింది. 1917 అక్టోబర్ నుంచి 1923 వరకు లెనిన్ నాయకత్వంలో, 1923 నుంచి 1953 వరకు స్టాలిన్ నాయవత్వంలో సోవియట్ రష్యాలో సామ్యవాద ప్రయోగం జరిగి ప్రజలు 1930 సామ్రాజ్యవాద ఆర్ధిక సంక్షోభానికి దూరంగా, రెండవ ప్రపంచ యుద్ద ఫాసిస్టు ప్రమాదాన్ని నిలవరించి సుఖశాంతులు అనుభవించారు. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్ (జర్మని), ముస్సోలిని (ఇటలీ), టోజో (జపాన్)ల నాజీజాన్ని ఫాసిజాన్ని మట్టి కరిపించి, పాశ్చాత్య దేశాల నామమాత్రమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, అంతకన్నా ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాలను యూరప్ దేశాల వలస పాలన నుంచి విముక్తి చేయడానికి స్టాలిన్ నాయకత్వంలో సోవియట్ రష్యా పాల్గొన్నది. బోల్షివిక్ విప్లవంలో కన్నా, రెండో ప్రపంచ యుద్దంలోనే రష్యా తన ప్రియమైన రెండు కోట్ల ప్రజల ప్రాణాలను పణం పెట్టింది. ప్రపంచ చరిత్రలోనే ప్రజాస్వామ్యం కోసం చేసిన మహత్తర త్యాగంగా ఇది నిలిచి పోయింది.
రెండవ ప్రపంచ యుద్దం తర్వాత మావో సె టుంగ్ నాయవత్వంలో చైనా కమ్యూనిస్టు పార్టీ జపాన్ సామ్రాజ్యవాద దాడిని ఎదుర్కొని 1949 అక్టోబర్ 1న ప్రజా రిపబ్లిక్‌గా అవతరించింది. అయితే ఇది ఒక్క రోజులోనే, కొద్ది రోజులలోనో సుసాధ్యమైన విజయం కాదు. 1922లో చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పిడి, గ్రామాల నుంచి నిర్మాణమవుతూ రెండు పంథాల మధ్య పోరాటాన్ని నిర్వహిస్తూ, మావో నాయకత్వం స్థిరపడిన తర్వాత గానీ సాధ్యమైంది కాదు. ఇందుకోసం ఏళ్లతరబడి, వేలమైళ్లు నడిచిన లాంగ్‌మార్చ్ రక్త తర్పణలు, విప్లవ భూ సంస్కరణ, ఐక్య సంఘటన, ఎర్రసైన్యం నిర్మాణాలు 1935 తర్వాత దేశభక్తియుత శ్రేణులన్నిటినీ కూడగట్టి జపాన్ సామ్రాజ్యవాద దాడిని ఎదుర్కొనడం చివరకు మానవహారంగా టాటూన్ నది వంతెన దాటి పెకింగ్‌లో స్థావర యుద్దం చేసి గెలవడం దాకా ఇదంతా ఒక అరుణారుణ చరిత్ర, మూడు వేల సంవత్సరాల చైనా రైతాంగ పోరాటం చరిత్రను, యూడువేల సంవత్సరాల చైనా రైతాంగ పోరాటం చరిత్రను, సామ్రాజ్యవాద దశలో విప్లవాల చరిత్రను అధ్యయనం చేసి, విశ్లేషణ చేసి మావో సె టుంగ్ హునాన్ ప్రాంతంలో భూ సంబంధాల అధ్యయనం, పరిశీలన, విశ్లేషణ చేసి నూతన ప్రజాస్వామిక విప్లవం సిద్దాంతాన్ని రచించాడు. వ్యవసాయ దేశాల్లో విప్లవం నూతన ప్రజాస్వామిక విప్లవ దశలో ప్రవేశించి గానీ సామ్యవాదంలోకి అడుగిడజాలదని గ్రహించాడు. నూతన ప్రజాస్వామిక విప్లవ దశలో కార్మికవర్గ నాయకత్వంలో భూమిలేని నిరుపేద మొదలు, ధనిక రైతు వరకు, ఫ్యాక్టరీ కార్మికుడు మొదలు జాతీయ బూర్జువా వర్గం వరకు ఐక్య సంఘటనలో పోల్గొంటారని కమ్యూనిస్టు పార్టీ ఐక్య సంఘటనలో పాల్గొంటారని కమ్యూనిస్టు పార్టీ ఐక్య సంఘటన, ఎర్ర సైన్యం ప్రజల చేతిలో మూడు మంత్ర దండాల వంటివని చెప్పారు.
చైనా 1949 నుంచి 1956 వరకు నూతన ప్రజాస్వామిక విప్లవ దశలో కొనసాగి ‘ఒక పెద్ద గెంతు’ (గ్రేట్ లీప్ ఫార్వర్డ్)తో 1956లో సామ్యవాద దశలోకి ప్రవేశించింది. సరిగ్గా 1956లోనే అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక సైద్దాంతిక ఘర్షణ, చర్చ, చీలిక వచ్చింది. 1956లో రష్యాలో జరిగిన అంతర్జాతీయ కమ్యూనిస్టుపార్టీ సమావేశంలో కృశ్చేవ్ వర్గ సామరస్య సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు.
ఇంచుమించు చైనాతోపాటు ఇండియాలోఏర్పడని కమ్యూనిస్టు పార్టీ (1945)లో లోహోర్, మీరట్, కాకోరీ వంటి ప్రాంతాల్లో తిరుగుబాట్లు, పునప్రావాయిలార్, మలబార్ (ఇప్పటకేరళలో) వంటి చోట్ల రైతాంగ పోరాటాలు, బెంగాల్‌లో తెభాగా పోరాటం (పండించిన పంటలో మూడో వంతు మాత్రమే భూస్వామికీ, రెండు వంతులు కౌలుదారుకు చెందాలనే డిమాండ్) నిర్వహించినప్పటికీ, కలకత్తా, బోంబాయి వంటి మహానగరాల్లో నావికా తిరుగుబాటు మొదలు , బట్టల మిల్లుల కార్మికుల వరకు ఎన్నో మిలిటెంట్ పోరాటాలు నిర్వహించినప్పటికీ వర్గ పోరాటమనదగింది. తెలంగాణ రతాంగ సాయుధ పోరాటమే.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని (1946-51) సాయుధ పోరాటమని, విముక్తి పోరాటమని చెప్పుకున్నంతగా నాయకత్వం వహించిన కమ్యూనిస్టు పార్టీగానీ, సుందరయ్య గారితో సహా చరిత్ర రచయితలగానీ విప్లవంగా అభివర్ణించలేదు. విప్లవం కాదగిన వర్గపోరాట అంశాలు (ఇన్‌గ్రెడియంట్స్), శక్తి (పొటెన్షియల్) అన్నీ అందులో ఉన్నాయి. చైనాలో నిర్మాణమైనంత పటిష్టంగా తెలంగాణలోనూ (హైదరాబాద్ రాష్ట్రంలో అనికూడా అనవచ్చు) ఆంధ్ర మహాసభ పేరుతో ఐక్య సంఘటన 1930 నాటికి బలంగా ఏర్పడింది. అందులో నీళ్ల చేపల వలే కమ్యూనిస్టు పార్టీ 1944 దాకా కూడా పని చేయగలిగింది. కొద్దిమంది విద్యావంతులు తెలుగుభాష స్వీయ గౌరవం కోసం ప్రారంభించిన ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో వెట్టి చాకిరీ రద్దయి దున్నే వారికి భూమి దక్కాలనే పోరాటం దాకా తీసుకుపోగలిగారు. అట్టడుగు స్థాయిలో వ్యవసాయ కూలీలను, భూమిలేని నిరుపేదలను కూడగట్టి సంగాలు పెట్టి, గుత్పల సంగాలు పెట్టి సుత్తీ కొడవలి ఎర్ర జెండా నాయకత్వంలో మూడువేల గ్రామాల్లో పది లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు, ప్రజలకు బీజ ప్రాయంలో ఎర్రరాజ్యాన్ని చవిచూపారు. ఢిల్లీలో 1947 ఆగస్ట్ 15న అధికార మార్పిడి జరిగి ఏర్పడిన నెహ్రూ, పటేల్ ప్రభుత్వం 1947 నవంబర్‌లో నిజాం రాజుతో యాథాతథ ఒడంబడిక చేసుకున్న తర్వాత 1948 సెప్టెంబర్11న సాయుధ పోరాటం చేపట్టి 1951 నవంబర్ దాకా తమ విజయాలను, తమ స్వాధీనంలో ఉన్న భూమిని ప్రజల పరంగా సంరక్షించుకోవడానికి ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారు.
అయినా 1951లో సాయుధ పోరాట విరమణ తర్వాత కమ్యూనిస్టు పార్టీ తన నాయకత్వంలో స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి భూస్వాములకు అప్పగించింది. ఆయుధాలనూ నెహ్రూ ప్రభుత్వానికి అప్పగించింది. ఇప్పటిదాకా అజ్ఞాతంలో ఉన్న కమ్యూనిస్టులు (గెరిల్లాలు అనే మాట కూడా అంత ప్రచారంలో ఉన్నట్లు లేదు), పూర్తికాలపు విప్లవకారులు సాధారణ జీవితంలోకి 1952సాదారణ ఎన్నికల వరకు వచ్చేసారు. 1952 ఎన్నికల్లో పాల్గొన్నారు. మళ్లీ అవిభక్త కమ్యూనిస్టు పార్టీ నుంచి గానీ 1964లో ఏర్పడిన సిపిఐ నుంచి గానీ కొంతమంది విప్లవ శ్రేణులు తప్ప పార్టీలు గానే ఆ రెండూ ఇప్పటికీ పార్లమెంటరీ పంథానే అంటిపెట్టుకొని ఉన్నవి.
కనుక 1956లో కశ్చప్ ప్రతిపాదించిన వర్గ సామరస్య సిద్దాంతం ‘తొందరపడి ఒక కోకిల ముందే కూసినట్లు’ గా అవిభక్త, కమ్యూనిస్టు పార్టీ మన దేశంలో 1951లోనే ప్రతిపాదించింది. 1952నుంచి అమలవుతున్నది. షహీద్ భగత్‌సింగ్ ప్రతిపాదించిన కార్మిక, కర్షక రాజ్యం గానీ, ఇన్‌ఖ్విలాబ్ నినాదంగానీ, ఇది సాదించడానికి నిర్మించిన హిందుస్థాన్ ఫౌజ్, నవజవాన్ భారత్ సభ వంటి విప్లవ నిర్మాణాల గురించి కమ్యూనిస్టు పార్టీ ఎందుకు ప్రయత్నించలేదు? తిలక్ గోఖలేల కాలం నుంచి తిలక్-గాంధీలు, గాంధీ- నెహ్రూలు, ఇందిరా-మొరార్జీలు, కేంద్రంలో సోనియా గాంధీ దాకా, రాష్ట్రంలో ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌ఆర్:ల దాకా అధికార పార్టీల్లోని ప్రగతిశీల శక్తులతో పొత్తుల గురించి ఆలోచించినంతగా 52 నుంచి కమ్యూనిస్టు పార్టీలు తమ నాయకత్వంలో కార్మికవర్గాన్ని అధికారంలోకి తేవడానికి ప్రయత్నించలేదు. అంటే పార్లమెంటరీ రాజకీయాలకు పరిమితమయ్యాయి.
1946లో చైనా మార్గమే మన మార్గమని స్ఫురించినప్పటికీ దున్నేవారికే భూమి నినాదాన్ని భూస్వాధీనం చేసుకున్నప్పటికీ మనది కూడా నూతన ప్రజాస్వామిక విప్లవ పంథా కావాలని, పోరాట శ్రేణుల విప్లవాచరణ అదేనని నాయకత్వానికి చైతన్యపూర్వకంగా అర్థం కాలేదు. అంటే వాళ్లందుకు సిద్దంగా లేరు. అందుకే అది విప్లవం కాలేకపోయింది.
విప్లవం పోరాటంలో పల్గొనే శక్తులను విప్లవకర వర్గాలను రాజ్యాదికారానికి తేవాలి. విప్లవమంటే కేవలం ‘దున్నే వారికే భూమి’ అనే ఆర్థిక పోరాటం కాదు.