ప్రత్యేక రాష్ట్రంతోనే పాలమూరు సస్యశ్యామలం: కేసీఆర్‌

దేవరకద్ర: ఆపారమైన నీటి వనరులున్న పాలమూరు జిల్లా ఎడారిగా మారడానికి కారకులు వలసాంధ్ర పాలకులేనని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆరోపించారు. జిల్లాలోని దేవరకద్రలో జరిగిర పార్టీ కార్యకర్తల శిక్షణా శిబిరంలో కేసీఆర్‌ పాల్గొన్నారు. కేసీఆర్‌ తో పాటు కేకే, మందా జూలపల్లి, జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్న ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు పని చేసిన 9రూపాయలు కూడ ఇవ్వలేదని కేసాఆర్‌ విమర్శించారు.

ప్రతేక రాష్ట్రం ఏర్పడితేనే పాలమూరు జిల్లా సస్యశ్యామలం అవుతుందని, ప్రతి నియోజక వర్గంలో అక్ష ఎకరాలకు నీరు ఇచ్చే విధంగా మన ఇంజనీర్లు ప్రణాళికలు తయారు చేశారని, రాష్ట్రం ఏర్పడ్డకే ఇదే టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం ఈ కలను నెరవేరుస్త్తుెందన్నారు. జిల్లాలోని కల్వకుర్తి నెట్టంపాడు ప్రాజెక్టులు దశాబ్దాలుగా పెండింగులో ఉన్నాయని, ఆంధ్రాపాలన ఉన్నంత వరకు మున ప్రాజెక్టులను పూర్తి చేయ రని కేసీఆర్‌ అన్నారు. మన ప్రాజెక్టులు కడితే నీటిని తరలించుకోవడానికి వీలు కాదు కాబట్టి మన ప్రాజెక్టులు పూర్తా కావన్నారు.

జిల్లాలోని డీకే అరుణా ఇక్కడి నీళ్లకోసం పోరాటం చేయకుండా వారు నీళ్లు రాయలసీమకు తరలించుకుపోతే అక్కడికెళ్లి హరతిఇచ్చి స్వాగతించారని విమర్శించారు. మన రాష్ట్రం మనకోస్తే బ్రహ్మండంగా ప్రాజెక్టులు పూర్తి చేసుకుని జిల్లాను సస్యశ్యామలం చేసుకోవచ్చని కేసీఆర్‌ పాలమూరు జిల్లా ప్రజలకు సూచించారు. కండ్ల ముందే నీళ్లు కిందకు పోతుంటే మంత్రులు, ఎమ్మేల్యేలు పట్టించుకోరని ఆర్‌డీఎస్‌ తూమూలు పగులగొట్టి రాయలసీమకు నీళ్లు తీసుకుపోతుంటే మాట్లాడరని కేసీఆర్‌ ఆరోపించారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల జిల్లా ప్రజలు వలసలు పోతున్నారని, మన కష్టాలన్నీ తీరాలంటే మనమంతా ఏకమవ్వాలని, సీమాంధ్రా పార్టీలను పాతాళంలోకి తొక్కాలని కోరారు.